Date :12-07-2023
అమరావతి:
విఐటి – ఏపి విశ్వవిద్యాలయం మరియు ఐ ఎస్ డి సి (ISDC, UK) మథ్య అవగాహనా ఒప్పందం
MoU between VIT – AP University and ISDC (UK).
ఇటీవల విఐటి – ఏపి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB), విఐటి – ఏపి విశ్వవిద్యాలయం మరియు ఐ ఎస్ డి సి(ISDC, UK) ది . జులై 11, 2023 (మంగళవారం) విశ్వవిద్యాలయంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసారు.
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, విఐటి – ఏపి విశ్వవిద్యాలయంలో డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్‌ను అభ్యసిస్తున్న BBA విద్యార్థులకు డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ISDC సర్టిఫికేట్‌ను అందిస్తుంది. BBA ఫిన్‌టెక్ స్పెషలైజేషన్ విద్యార్థుల కోసం, ACCA గుర్తింపుతో ISDC ఫిన్‌టెక్‌లో సర్టిఫికేట్‌ను అందిస్తుంది.
బి. కామ్ (ఫైనాన్స్) అభ్యసిస్తున్న విద్యార్థుల కొరకు ACCA ఫౌండషనల్ లెవెల్ సర్టిఫికేషన్ కొరకు అన్ని పేపర్స్ మినహాయింపుతో పాటు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అవసరమైన 9 పేపర్స్ లో మినహింపుతో కేవలం 4 పేపర్స్ పూర్తి చేస్తే ACCA ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ పొందే వీలు కలుగుతుంది.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా || ఎస్. వి. కోటా రెడ్డి మాట్లాడుతూ విఐటి – ఏపి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అందించటంలో విఐటి – ఏపి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB) చేస్తున్న కృషిని అభినందించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరు వినియోగించుకొని ప్రయోజనం పొందాలని ఆకాంక్షించారు.
రాజేష్ పూనియా (ISDC జోనల్ హెడ్-సౌత్) మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ మరియు ఫిన్‌టెక్ రంగాలలో ISDC సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యతను తెలియచేసారు మరియు కోర్సు కంటెంట్‌లలో 140 గంటల డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్, ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ మార్కెటింగ్, SEO, వెబ్ మరియు సోషల్ మీడియా అనలిటిక్స్ టాపిక్స్ కవర్ చేయబడతాయని చెప్పారు. ఫిన్‌టెక్ సర్టిఫికేట్ 250 గంటల్లో 2 సెమిస్టర్‌ల కంటెంట్ అయినా బిజినెస్ అండ్ టెక్నాలజీ, ఫిన్‌టెక్, ఫిన్‌టెక్ అప్లికేషన్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఫిన్‌టెక్ యాప్‌లను టాపిక్స్ కవర్ చేయబడుతుంది తెలియచేసారు.
ACCA కోర్సుల శిక్షణలో 240 లెక్చర్ గంటలు, రివిజన్స్ మరియు మాక్ పరీక్షలు ఉంటాయి, వీటిని ISDC, UK యొక్క నిపుణులైన శిక్షకులు నిర్వహిస్తారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా || జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ ఫిన్‌టెక్ సర్టిఫికేషన్ బి.టెక్ విద్యార్థులకు కూడా ప్లేస్‌మెంట్ అవకాశాలను మరుగుపరచటంలో సహాయపడతాయని అభిప్రాయపడ్డారు
విఐటి – ఏపి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB) డీన్ డా|| శాంతకుమారి ఎస్ ఎస్ మాట్లాడుతూ ప్రస్తుత బిజినెస్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ నుండి డిజిటల్ మార్కెటింగ్ మరియు ఫిన్‌టెక్ స్పెషలైజేషన్ వంటి ఇతర డొమైన్‌లకు సర్టిఫికేషన్స్ విస్తరించినందుకు ISDC, UK ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విఐటి – ఏపి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB) అసోసియేట్ డీన్ డా|| రాఘవేంద్ర, అఖిల్ అగర్వాల్ (ఐఎస్‌డీసీ ఏపీ, తెలంగాణ రీజనల్ మేనేజర్), డా|| అరుణ్‌కుమార్ శివకుమార్ (బీబీఏ ప్రోగ్రామ్ చైర్), డా || గోపాలకృష్ణ యూఎం (బీకామ్ ప్రోగ్రామ్ చైర్ ) తదితరులు పాల్గొన్నారు.