మొబైల్ వాడకం – జ్ఞాపకశక్తి ఖతం
మహాభారత కాలంలో కర్ణుడు కవచ కుండలాలతో జన్మించాడు. అంటే ఆత్మరక్షణ కోసం యుద్ద రంగాన ధరించే కవచం, చెవులకు పెట్టుకునే ఆభరణాలతో ఆయన పుట్టాడు. ఈ రోజున మనమంతా కవచకుండలాలతో పుట్టకపోయినా, సెల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నాం. మొబైల్ మన శరీరంలో ఒకటిగా మారిపోయిందని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే రోజురోజుకు మొబైల్ ఫోన్లలో ఫీచర్లు మారిపోవడంతో ఇంట్లోనే ఉండి అన్ని పనులు చక్కపెట్లుకోవాలంటే మొబైల్ ఒక వరం. ఒక్కమాటలో చెప్పాలంటే మన ఫోన్లు ఎంత ఉపయోగకరంగా మారితే అంత ఎక్కువగా వాడగలం. కాని అది అవసరం లేనప్పుడు కూడా మనం దానిని అంటిపెట్టుకుని ఉండటంతోనే అనేక సమస్యలకు తావిస్తోంది.
సెల్ ఫోన్ తో బ్రెయిన్ డ్రైయిన్
ప్రతీ ఏడాది మొబైల్ వాడకం అనేది పెరిగిపోతూ ఉంది. పదే పదే ఫోన్ చెక్ చేయడం, నోటిఫికేషన్‌ని చూడటం వంటి పరధ్యానం మంచిది కాదని మనకూ తెలుసు. ఇది మనలోని జ్ఞాపకశక్తిని, దాని పనితీరును దెబ్బతీస్తుందనీ తెలుసు. అయినా దానిని విడవక పోవడం మన బలహీనత.
ఇక అత్యంత ప్రమాదకరమైన ది డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడటం. దీంతో అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాల సమయంలో డ్రైవర్లు నెమ్మదిగా ప్రతిస్పందించడానికి దారితీస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది.
ఏదైనా టాస్క్ చేస్తున్నపుడు ఫోన్‌లో డింగ్ అనే నోటిఫికేషన్ శబ్దం విన్నవాళ్ల పనితీరు తక్కువగా ఉంటున్నట్లు పరిశీలనలో తేలింది. ఆ సమయంలో వాళ్లు ఫోన్ ఉపయోగించలేదు కూడా.
ఏదైనా టాస్క్ చేస్తుండగా మాట్లాడటానికి లేదా మెసేజ్ చేయడానికి ఫోన్‌ని ఉపయోగించినపుడు కూడా ఈ ప్రభావం దాదాపుగా అలాగే ఉంటోంది.
ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే కాకుండా దాని ఉనికి సైతం యూజర్లను ప్రభావితం చేస్తుంది.
ఇటీవల పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. కొందరికి మొబైల్ పక్కనే పెట్టగా, మరికొందరికి సమీపంలో కనిపించకుండా (బ్యాగ్ లేదా జేబులో) లేదా మరొక గదిలో ఉంచాలని సూచించారు .
పార్టిసిపెంట్స్‌కు మెమరీ పవర్, వారి సామర్థ్యం, దృష్టిని పరీక్షించడం, సమస్య-పరిష్కారాలు తదితర టాస్క్‌లు ఇచ్చారు.
ఫోన్‌లు సమీపంలో కాకుండా మరొక గదిలో ఉంచుకున్న పార్టిసిపెంట్స్ టాస్కులు మెరుగ్గా పూర్తి చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
టాస్కులు చేస్తుండగా చాలామంది పార్టిసిపెంట్స్ తమ మొబైల్స్ గురించి ఆలోచించలేదన్నదీ నిజమే.
ఫోన్‌తో ఎక్కువసేపు గడిపితే “బ్రెయిన్ డ్రెయిన్” కారణమవుతుంది.
మన ఫోన్‌ని చూడాలా? వద్దా? అని నిరంతరం దిక్కులు చూడటమనేది (నోటిఫికేషన్ కోసం వేచి ఉండటం) మన మెదడును పనిలో దృష్టి కేంద్రీకరించనివ్వదు.
ఈ దృష్టి మరల్చడం అనేది పని చేయడాన్ని కష్టతరం చేస్తుంది. మొబైల్ పూర్తిగా వేరే గదిలో ఉంచడం మాత్రమే దీనికి “పరిష్కారం” అని పరిశోధకులు కనుగొన్నారు.
రాయడంతోనే జ్ఞాపకశక్తి
ఫోన్‌లపై ఆధారపడటం వలన మనకు జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇటీవలి ఒక పరిశోధనలో వాలంటీర్లకు న్యూమరికల్ సర్కిల్స్‌తో కూడిన స్క్రీన్‌ను చూపారు. సర్కిల్‌లో సంఖ్యలను సరైన వైపునకు తరలిస్తే వాలంటీర్‌కు డబ్బులు లభిస్తాయి.
పోటీల్లో సగం మందికి నోట్ చేసుకోవడానికి అనుమతించారు. మిగిలిన వారు తమ జ్ఞాపకశక్తిపై ఆధారపడ్డారు.
ఊహించినట్లుగానే నోట్స్ రాసుకున్న వారు మెరుగైన పనితీరు కనబరిచారు. కానీ ఆశ్చర్యకరంగా వారు రాయనివి కూడా గుర్తుంచుకున్నారు. దీంతో రాయడం అనేది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు.
డివైజ్‌పై ఆధారపడితే మన జ్ఞానానికి దీర్ఘకాలికంగా ఏమవుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులకు చాలా సంవత్సరాలు పడుతుంది. దాని దుష్ప్రభావాలను తగ్గించడానికి మనం ప్రయత్నించగల మరొక మార్గం ఉంది. మన మెదడు గురించి మనం ఎలా ఆలోచించే తీరు అది
మనం ఏం నేర్చుకోవాలి?
మన బ్రెయిన్‌కు పరిమిత వనరులు ఉన్నాయని భావించే వ్యక్తులతో పోలిస్తే అపరిమిత వనరులున్నాయని భావించే వారు పనిపై స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. తదుపరి పనిపై వారికి ప్రతికూలత ప్రభావం ఉండకపోవచ్చు.
ఫోన్ కు బానిసలు కావద్దు ఫోన్ వద్దకు వెళ్లకుండా మరొక గదిలో ఉంచడం సాధన చేయండి. మన మెదడులో నేను అనుకున్నదానికంటే ఎక్కువ వనరులు ఉన్నాయని గుర్తు చేసుకోవడం ద్వారా
ఫోన్‌ని చూడాలనుకునే ఆకర్షణ నుంచి దూరం అవ్వండి. అందుకోసం పుస్తకం చదవడం, ఎప్పటి నుంచో నిర్లక్ష్యానికి గురవుతున్న పనులను చేసుకోవడం మనకు చాలా రిలీఫ్ ఇస్తుంది.
జీవితంలో వడివడిగా ముందుకు పోవాలంటే మొబైల్ ను కాకుండా, పనులకు ప్రాధాన్యత ఇవ్వడమే సరైన పద్దతి. దానిని ఈ క్షణం నుంచే అమలు చేయండి. మీ బ్రెయిన్ డ్రైయిన్ కాకుండా కాపాడు కోండి.
Mobile usage – memory loss
During the Mahabharata period, Karna was born with Kavacha Kundalas. That means he was born with armor and ear ornaments to wear on the battlefield for self-defense. Even though we are not all born with armor these days, we cannot spend a single moment without a cell phone. It goes without saying that mobile has become one of our bodies.
But with the features of mobile phones changing day by day, mobile is a boon to stay at home and get all the work done. In short, the more useful our phones become, the more we can use them. But clinging to it even when we don’t need it leads to many problems.
Brain drain with cell phone
Mobile usage is increasing every year. We all know that distraction like repeatedly checking the phone and looking at the notification is not good. It is known that it damages our memory and its performance. But not letting it go is our weakness.
Talking on the phone while driving is the most dangerous. A study revealed that this causes drivers to react more slowly during sudden accidents.
It has been observed that the performance of those who hear the notification sound of ding on the phone while doing any task is lower. They didn’t even use the phone at that time.
This effect is almost the same when using the phone to talk or text while performing a task.
Not only while using the phone but also its presence affects the users.
Recently researchers conducted a study. Some are advised to keep the mobile next to them, while others are advised to keep it out of sight (in a bag or pocket) or in another room.
Participants were given tasks to test their memory power, ability, attention, problem-solving etc.
The researchers found that participants who placed their phones in a different room than near them completed the tasks better.
It is true that many participants did not think about their mobiles while doing the tasks.
Spending too much time on the phone can cause “brain drain”.
Want to see our phone? don’t you Constantly looking at directions (waiting for notification) does not allow our brain to focus on the task at hand.These distractions make it difficult to work. Researchers have found that the only “solution” to this is to put the mobile in a different room entirely.
Memory through writing
Many people believe that our dependence on phones is causing us memory loss. A recent study showed volunteers a screen with numerical circles. Moving the numbers in the circle to the correct direction earns the volunteer money.
Half of the competitions were allowed to take notes. The rest relied on their memory.
As expected, those who took notes performed better. But surprisingly they also remembered what they didn’t write down. Researchers have found that writing has an effect on memory.
It will take years for researchers to determine what the long-term effects of relying on the device will be on our knowledge. There is another way we can try to reduce its side effects. It’s how we think about our brain
What should we learn?
People who think our brains have unlimited resources have more self-control on the task compared to people who think our brains have limited resources. They may not have a negative impact on subsequent work.
Do not become addicted to the phone
Practice putting the phone in another room instead of going to it. By reminding ourselves that our brains have more resources than I thought
Avoid the temptation to look at the phone. For that, reading a book and doing things that have always been neglected will give us a lot of relief.
If you want to move forward freely in life, the right method is to give priority to work rather than mobile. Implement it from this moment. Keep your brain from being drained.