Minister Lokesh visited Mopidevi Sri Subrahmanyeshwara Swamy Temple
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
మోపిదేవి: జూన్ 24, 2026
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టిజిఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నాగపుట్ట వద్ద పాలుపోసి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంత్రి నారా లోకేష్ ను ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, బందరు పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జోనల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, భాష్యం ప్రవీణ్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, యువ నాయకుడు మండలి రాజా తదితరులు పాల్గొన్నారు.

















































