వైయస్సార్ వాహన మిత్ర ద్వారా డ్రైవర్లకు ఏటా రూ 10,000 సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం-నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకమ రెడ్డి నారాయణమూర్తి
దేశంలో మరెక్కడా లేని విధంగా, మన రాష్ట్రంలోనే సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న,ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు,ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు, వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా, ఏటా రూ 10,000 లు, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకమ రెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటనలో ధన్యవాదాలు, డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న, తమ బతుకు బండి లాగడానికి మాత్రం, ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా ఉంటూ, వరుసగా ఐదో విడత వాహన మిత్ర ద్వారా 2,75,931 మంది లబ్ధిదారులకు, ఒక్కొక్కరికి రూ. 10,000 లుచొప్పున 275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని, విజయవాడ విద్యాధరపురంలో బటన్ నొక్కి, వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారన్నారు. వైయస్సార్ వాహన మిత్ర కింద ఈ చివరి ఏడాది అందించిన రూ 275.93 కోట్లతో కలిపి,ఈ ఐదేళ్లలో డ్రైవర్లకు ప్రభుత్వం అందించిన సాయం రూ 1,301.89 కోట్లుగా తెలిపారు. ఈ లెక్కన ఏడాదికి రూ10,000 చొప్పున,ఒక్కొక్క డ్రైవర్ అన్నకు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, 50 నెలల్లో అందించిన సాయం అక్షరాల రూ 50,000 లని నారాయణ మూర్తి తెలియజేశారు.
వివిధ సామాజిక తరగతుల వారీగా 2023-24 సంవత్సరానికి గాను, ఎస్సీ డ్రైవర్లు 67,513 మందికి, ఎస్టీ డ్రైవర్లు 11,497 మందికి, బీసీ డ్రైవర్లు 1,51,271 మందికి, మైనారిటీలైన ముస్లిం, క్రిస్టియన్ ఇతర మత డ్రైవర్లు 5,100 మందికి, అలాగే కాపు డ్రైవర్లు 25,046 మందికి, మిగిలిన కులాలకు చెందిన డ్రైవర్లు 15,504 మందికి కలిపి 2,75,931 మంది డ్రైవర్లు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. వైయస్సార్ వాహన మిత్ర కింద ప్రతి ఏడాదికి లబ్ధిదారులు పొందిన మొత్తం సాయాలు చూస్తే 2019 -20 కి గాను 2, 36,344 మంది లబ్ధిదారులకు అందిన లబ్ధి 236.34 కోట్లు, 2020 – 21 కి గాను2, 73,476 మందికి అందిన సాయం 273.47 కోట్లు, 2021- 22 కు గాను 2,54, 646 మందికి రూ 254.64 కోట్లు, 2022-23 కు గాను 2,61,516 మందికి 261.51కోట్లు, 2023 – 24కు గాను 2,75,931 మందికి 275.93 కోట్లు, కలిపి ఐదేళ్లలో అందించిన మొత్తం సాయం1, 301.8 9 కోట్లని తెలియజేశారు.
రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా ఉంటూ, సకాలంలో ఇన్సూరెన్స్ కట్టేందుకు, అవసరమైన రిపేర్లు చేయించుకుని వారి వాహనాలను మంచి కండిషన్లో ఉంచుకునేందుకు, వారి కుటుంబాలు క్షేమంగా ఉంటూ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు, అండగా ఉంటున్న జగనన్న ప్రభుత్వానికి, డ్రైవర్లతోపాటు, ప్రజలందరూ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నారంటూ, నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు.