సియం హామీలు సత్వర అమలుకు చర్యలు తీసుకోండి
సిఎస్ అమరావతి,27నవంబరు:రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు సత్వర అమలుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సియం హామీలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సియం జిల్లాల పర్యటన సందర్భంగాను,వివిధ బహిరంగ సభల్లోను ప్రజలకు ఇచ్చిన హామీలు సహా వివిధ ప్రజా ప్రతినిధుల లేఖలకు సియం స్పందించి ఇచ్చిన హామీలు,ఇతర సందర్భాల్లోను ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను సమీక్షించారు.మొత్తం 443 సియం హామీలకు గాను ఇప్పటికే 123 హామీలకు పైగా పరిష్కరించగా ఇంకా 224 వివిధ శాఖాధిపతులు స్థాయిలో ప్రోగ్రస్ లో ఉండగా,24 అంశాలకు సంబంధించి స్టేటస్ అప్డేట్ చేయాల్సి ఉండగా ఆర్ధిక అంశాలకు సంబంధించి 72 హమీలు ఆర్ధికశాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయని సిఎస్ పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న సియం హామీలను శాఖలవారీగా ఆయన సమీక్షించారు.పెండింగ్ లో ఉన్న సియం హామీలన్నిటినీ త్వరితగతిన వేగవంతంగా అమలు చేసేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో రాష్ట్ర ఆర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,టిఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న,సియంఓ కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు,సిఎంఓ అదనపు కార్యదర్శి భరత్ గుప్త,గృహ నిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీషా పాల్గొన్నారు.అలాగే వీడియో లింక్ ద్వారా పిఆర్ అండ్ ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,బిసి సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము,మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.