యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో సిఎస్ సమీక్ష.
విజయవాడ,30 నవంబరు: కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామంలో యురేనియం ప్లాంట్ కు సంబంధించిన అంశాలపై గురువారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సియండి డా.సికె అశనాని(Asnani)తో పాటు ఇతర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సమీక్షించారు.
ఈసమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, ఆర్థికశాఖ కార్యదర్శి డా.ఎన్.గుల్జార్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బి.శ్రీధర్,జాయింట్ చీఫ్ ఇన్విరాన్మెంటల్ ఇంజనీరు కె. శ్రీరామూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వీడియో లింక్ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన యం.టి. కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.