Amaravati, 24th February: The State High Court gave a grand farewell to Justice C. Praveen Kumar, who served as the In-charge Chief Justice of the Andhra Pradesh High Court for some time and retired as the next judge. A grand farewell program was held for Justice Praveen Kumar.
In the e-video program, the Chief Justice of the High Court, Justice Prashant Kumar Mishra said that when the High Court of Andhra Pradesh was established here in the context of the state bifurcation, Justice Praveen Kumar had done better work as the in-charge Chief Justice in creating buildings and other infrastructure. Justice Praveen Kumar was a judge for about 26 years. Chief Justice Mishra specially praised him for solving thousands of cases and rendering countless services. Justice Praveen Kumar is a role model for young lawyers and his personality is full of faith and compassion. Chief Justice PK Mishra praised Justice Praveen Kumar as a member of various committees and rendered good services to the judiciary. Moreover, Chief Justice Prashant Kumar Mishra praised Justice Praveen Kumar for his services to AP Judicial Academy and AP Legal Services Authority.
Justice C. Praveen Kumar, who retired as a judge, said that the High Court of Andhra Pradesh has a rich history of flourishing into three High Courts for three states. On December 31, 2018, the Andhra Pradesh High Court moved to Vijayawada from Hyderabad, and the High Court building was inaugurated here in February 2019, and the High Court has been in operation since March 2019. He said that the activities are done here. When the High Court came here, there were only 18 judges, today there are 31 judges. From the time he was enrolled as an advocate in 1986, former chief justices, judges, present associate justices, bar members, office, who have helped him to reach this level. Justice Praveen Kumar thanked the individual officers, staff and everyone in the name of Justice Praveen Kumar. Done.
In this program, State High Court Advocate General S.Sreeram said that Justice Praveen Kumar was not only an undisputed person but also a good humanitarian and a simple person. Similarly, he mentioned that his services to the judiciary as the in-charge Chief Justice of the High Court and currently as a judge are countless. President of the High Court Bar Association K. Janakirami Reddy said that Justice Praveen Kumar, who was born in 1961 in Hyderabad, was enrolled as an advocate in 1986 and was appointed as an Additional Judge of the Andhra Pradesh High Court in 2012 and as a Judge in 2013. Speaking, Har Nadh praised Justice Praveen Kumar for his services to the judiciary.
Many judges, registrars, Additional Advocate General, PP, Bar Association, Bar Council members and others participated in the farewell program.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు
అమరావతి,24 ఫిబ్రవరి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి కొంత కాలం పాటు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తదుపరి న్యాయమూర్తిగా సేవలందించి పదవీ విరమణ చేసిన జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ కు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది.
శుక్రవారం రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని పుల్ కోర్టు ఆధ్వర్యంలో జస్టిస్ ప్రవీణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈవీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ ఏర్పాటైనపుడు భవనాలు,ఇతర మౌలిక సదుపాయాలు కల్పనలో ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ మెరుగైన కృషి చేశారని కొనియాడారు.జస్టిస్ ప్రవీణ్ కుమార్ న్యాయమూర్తిగా సుమారు 26 వేల కేసులను పరిష్కరించి ఎనలేని సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ప్రత్యేకంగా కొనియాడారు.జస్టిస్ ప్రవీణ్ కుమార్ యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయుడని,ఆయన వ్యక్తిత్వం పూర్తిగా విశ్వాసం,కరుణతో నిండి ఉందని పేర్కొన్నారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ వివిధ కమిటీలకు సభ్యునిగా ఉండి న్యాయవ్యవస్థకు మెరుగైన సేవలు అందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె.మిశ్రా కొనియాడారు.అంతేగాక ఎపి జుడీషియల్ ఎకాడమీకి,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీకి కూడా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రశంసిచ దగ్గ సేవలను అందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కొనియాడారు.
న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మూడు రాష్ట్రాలకు మూడు హైకోర్టులుగా వర్ధిల్లిన ఘన చరిత్ర కలిగి ఉందని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.2018 డిశంబరు 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాదు నుండి విజయవాడకు రావడం జరిగిందని,2019 ఫిబ్రవరిలో ఇక్కడ హైకోర్టు భవనం ప్రారంభం కాగా 2019 మార్చి నుండి హైకోర్టు కార్యకలాపాలు ఇక్కడ జరుగు తున్నాయాని చెప్పారు.హైకోర్టు ఇక్కడకు వచ్చేనాటికి 18 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండే వారని నేడు 31 మంది న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు.1986లో న్యాయవాదిగా తాను ఎన్రోల్ అయిన నాటి నుండి నేడు ఈస్థాయికి చేరుకునేందుకు తనకు సహాయ సహకారాలు అందించిన పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు,న్యాయమూర్తులు, ప్రస్తుత సహచర న్యాయమూర్తులు,బార్ సభ్యులు,కార్యాలయ,వ్యక్తిగత అధికారులు,సిబ్బంది, ప్రతి ఒక్కరికీ జస్టిస్ ప్రవీణ్ కుమార్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.తాను డాక్టరు లేదా సివిల్ సర్వెంట్ అవ్వాలని తాను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతోనే న్యాయవ్యవస్థలో సేవలందించే అవకాశం కలిగిందని జస్టిస్ ప్రవీణ్ కుమార్ తన మనోగతాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ ప్రవీణ్ కుమార్ నిర్వివాద వ్యక్తే కాకుండా మంచి మానవతావాదని,సింపుల్ గా ఉండే వ్యక్తని కొనియాడారు.అదే విధంగా హైకోర్టుకు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తిగాను,ప్రస్తుతం న్యాయమూర్తిగాను ఆయన న్యాయవ్యవస్థకు అందించిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.జానకిరామి రెడ్డి మాట్లాడుతూ 1961లో హైదరాబాదులో జన్మించిన జస్టిస్ ప్రవీణ్ కుమార్ 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ కాగా 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగాను,2013లో న్యాయమూర్తిగా నియమింపబడి ఎనలేని సేవలందించారని కొనియాడారు.అనేక రకాల తీర్పులను ఆయన వెలువరించారని గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హర్ నాధ్ లు మాట్లాడుతూ జస్టిస్ ప్రవీణ్ కుమార్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.
ఈవీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు,అదనపు అడ్వకేట్ జనరల్,పిపి,బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.