దసరా : ప్రాకృతిక శక్తులను, కాలాన్ని ఆరాధించే ఓ అద్భుతమైన పండుగ-
దశ హర (దసరా) అని పిలుస్తూ… దశకంఠుడైన రావణుడిని రాముడు సంహరించిన నేపథ్యంలో ఈ పండుగను దసరాగా పిలుస్తారని ఓ తప్పుడు భావన కొన్ని స్థానిక నమ్మకాల్లో చోటుచేసుకుంది.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులను నవరాత్రులని, దేవీ నవరాత్రులలో పదవ రోజును విజయ దశమితో లేదా దసరా(10వ రోజు)అని పిలుస్తారు.
ఈ పండుగ శక్తి ఆరాధనను నొక్కి చెబుతుంది మరియు దీనిని నవరాత్రి మరియు శరన్నవరాత్రి అని కూడా పిలుస్తారు.మహాలయకారకత్వ శక్తి స్వరూపిణి ధర్మం ‘లయం’ చేయడం.లయం అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్థం ప్రచారంలో ఉంది. ‘లయం’ అంటే లీనం చేసుకోవడం,లేదా తనలో కలుపుకోవడం అని విస్తృతార్థం. ఈ సృష్టి ఒక క్రమ పద్ధతిలో లయబద్ధంగా నడుస్తూ ఉంటుంది. శివుడి డమరుకానికి అనుగుణంగా(శబ్దశక్తికి అనుగుణంగా) ప్రకృతి ధర్మం లయబద్ధంగా నడుస్తూ ఉంటుంది. ఈ సృష్టి ఈ క్రమ పద్ధతిలో నడుస్తూ శక్తి మార్పిడి ద్వారా సృష్టి జరుగుతూ ఉంటుంది. ప్రకృతి కాలం జనన మరణాల్ని నిర్దేశిస్తుంది.అదే లయ.
మహా లయం అంటే ఓ అద్భుతమైన గొప్ప శక్తి స్వరూపిణి ఈ భూమి మీదకు అడుగుపెట్టడమే.
కాల చక్రాన్ని అనుసరించి ‘మహా లయ అమావాస్య’ రోజున అలా అడిగిన ప్రాకృతిక శక్తి (పార్వతి) కొన్ని మార్పులను సంతరించుకుంటుంది.జీవుల యొక్క కొన్ని ప్రవర్తనలు కూడా సవరించబడతాయి,ఈ ప్రాకృతిక పర్యావరణ మార్పులు జీవులలో సమయం గడిచే అనుభూతి మరియు సృష్టికి అవసరమైన శక్తిని ప్రేరేపిస్తుంది.
కాలం ప్రాకృతిక ధర్మాల మీద నియంత్రణను కలిగి ఉంటుంది.కాలానికి ఉన్న శక్తి అనంతం.ప్రాకృతిక శక్తులన్నిటిని కలిపి మూలాధార శక్తి స్వరూపిణిగా భావించి ఆరాధించడాన్ని భారతీయ తత్వశాస్త్రంలో చాలా నిగూఢంగా, లోతుగా ఈ విషయం చెప్పబడింది.శాక్తేయుల (శక్తిని పూజించేవాళ్ళు) పూజల వల్ల ప్రకృతి పరవశించి తమ వశం(Control) అవుతుందని వారి నమ్మకం.
ఈ సృష్టికి మూలం శక్తి. అనంతమైన శక్తి నుండే అన్ని జీవులు ఉద్భవించాయి. అమ్మలకు అమ్మగా ప్రాకృతిక శక్తిని భావించి పూజించడం ఓ అద్భుతమైన భావన. తెలంగాణలో ‘బతుకు అమ్మ’ పేరున ప్రకృతిక శక్తిని పూజించే సదాచారం నిజంగా ఓ అద్భుతం. కాలాన్ని (కాళికాశక్తి)పూజించే మరో అద్భుతమైన ఆచారం కలకత్తాలో ఉంది.భారత దేశంలోని అనేక స్థానిక ఆచారాలలో ఈ పండుగ కలిసి పోయి రూపాంతరం చెందడమే కాకుండా నామాంతరం కూడా చెందినది.
శక్తి సృష్టికి మూలం, అన్ని జీవులు అనంతమైన శక్తి నుండి ఉద్భవించాయి. కాలం జనన, మరణాల్ని నిర్దేశిస్తుంది. ఇదొక క్రమ పద్ధతిలో లయబద్ధంగా నడుస్తూ ఉంటుంది. సృష్టికి మూలమైన ప్రాకృతిక శక్తిని,కాలశక్తిని ఆరాధించడం అనేది ఈ పండుగలో దాగి ఉన్న ఓ లోతైన భావనగా చెప్పవచ్చు.
భారతీయ పండగలలో ప్రకృతిని,కాలాన్ని ఆరాధించడం అనే తాత్విక భావన నిజంగా అద్భుతమైనది.
అందరికీ దసరా శుభాకాంక్షలు….🌿🌲💐
– కే.వీ.కృష్ణయ్య@ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం.
————————
Dasara-festival emphasizes the worship of Shakti and is also called Navratri and Sharannavratri
————————
The nine days from Ashwayuja Shuddha Padyami to Ashwayuja Shuddha Navami are known as Dasara, along with the tenth day of Devi Navratri, Vijaya Dashami. This festival emphasizes the worship of Shakti and is also called Navratri and Sharannavratri. It derives its name from falling in early autumn.
Some misconceptions suggest that Dasara is named after Rama’s slaying of Ravana, known as Dasakantha. However, Mahalayakarakatva Shakti embodies Dharma, and ‘layam’ in this context means to absorb or incorporate into oneself, not destruction.
Maha lyam signifies the arrival of a great form of power on Earth, as natural energy (Parvati) undergoes changes that influence the behavior of living beings and the feeling of passing time.
Time has control over Prakriti dharmas, and the power of time is infinite. Indian philosophy mysteriously unites all forces of nature, worshiping them as primordial power, believing that nature can be controlled through such worship.
Shakti is the source of creation, with all living things originating from infinite energy. The practice of worshiping natural energy as Batuku Amma in Telangana and the ritual of worshiping time in Calcutta are wonderful examples of this concept.
The philosophical concept of worshiping nature in Indian festivals is indeed remarkable. Happy Dussehra to all!
So, festival of Dasara is not named after Rama’s slaying of Ravana. “Layam” in the context of Dasara does not mean destruction, but rather absorption or incorporation into oneself.
This festival is a celebration of the power of nature and time. Natural energy undergoes changes during Dasara that influence the behavior of living beings and the feeling of passing time.
The Indian philosophical concept of uniting all forces of nature into one primordial power which is reflected in the practice of worshiping natural energy in Telangana and the ritual of worshiping time in Calcutta.
The philosophical concept of worshiping nature in Indian festivals is remarkable.
-KV. Krishnaiah@AP. Secretariat