ఫార్మసీ కళాశాల సంఘం కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయడం
గతంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్నటువంటి అన్ని ఫార్మసీ కాలేజీలకు సంబంధించి అప్లికేషన్ రుసుము 2018 కంటే మూడింతలు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను గౌరవ హైకోర్టులో సవాల్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల సంఘం.
గౌరవ హైకోర్టు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేస్తూ నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ రుసుము స్వీకరించి కళాశాలల అప్లికేషన్స్ ప్రాసెస్ చేయమని మధ్యంతర ఉత్తరంలో ఇచ్చినది.
ఆ తీర్పును ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమలు చేయకపోవడంతో ఫార్మసీ కళాశాల సంఘం కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయడం జరిగింది.
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవ హైకోర్టులో వేసిన పిటీషన్స్ ను గౌరవ సుప్రీంకోర్టునకు ట్రాన్స్ఫర్ చేసి, అలాగే హైకోర్టులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.
గౌరవ సుప్రీంకోర్టు ఈ ట్రాన్స్ఫర్ కేసును ఈరోజు విచారణకు స్వీకరించి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభ్యర్థనను తోసిపుచ్చింది. కేసును నాలుగు వారాలకు వాయిదా వేయడం జరిగింది.
మతుకుమిల్లి శ్రీవిజయ్, స్టేట్ లీగల్ అడ్వైజర్ , హైకోర్టు న్యాయవాది
Registration of Contempt of Court cases by College of Pharmacy Association
The Association of Private Pharmacy Colleges of Andhra Pradesh has challenged in the Hon’ble High Court the order given earlier by the Pharmacy Council of India increasing the application fee by three times that of 2018 in respect of all pharmacy colleges in the country.
The Hon’ble High Court set aside the order passed by the Pharmacy Council of India and issued an interim letter to accept the application fee and process the applications of the colleges as per the notification.
As the Pharmacy Council of India did not implement that judgment, the pharmacy college association registered contempt of court cases.
The Pharmacy Council of India transferred the petitions filed in the Hon’ble High Court to the Hon’ble Supreme Court and also appealed to the Hon’ble Supreme Court to quash the interim orders passed in the High Court.
Hon’ble Supreme Court took up this transfer case for hearing today and rejected the request of Pharmacy Council of India. The case was adjourned for four weeks.
Matukumilli Srivijay , State Legal Adviser, High Court Advocate