జగనన్నకు సైనికుల్లా…
వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పిలుపు
కర్నూలులో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్
కర్నూలు: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా యాక్టివిస్టులు సైనికుల్లా పని చేయాలని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో మంగళవారం వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు సజ్జల భార్గవ్‌రెడ్డి ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో పార్టీ అభ్యర్థులు గెలుపొందటానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా పనిచేశారని, మరలా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా పనిచేయడం, సోషల్ మీడియా ఛానళ్లను ప్రభావవంతంగా వినియోగించుకోవడం, పార్టీని ఆయా వేదికల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు చేరువ చేసే విధివిధానాలు, ప్రణాళికలను భార్గవ్ రెడ్డి వివరించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలి నుంచీ పార్టీ సోషల్ మీడియా పటిష్టంగా ఉండడంలో ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర పోషించారు. వారందరినీ నేరుగా కలిసి పార్టీ సోషల్ మీడియా బలోపేతం చేసే అంశంపై సజ్జల భార్గవ్ ఈ కార్యక్రమం ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, సుధాకర్, పండుగాయల రత్నాకర్, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.