– క్వార్డ్జ్మైనింగ్పై ‘ఈనాడు’ రాతలు పూర్తి అవాస్తవం
– దేవుడిమాన్యంలోక్వార్జ్ట్మైనింగ్జరగడం లేదు
– 2012లో దేవాదాయశాఖరమాదేవికి 10 ఎకరాలభూమికిలీజు
– ఈ భూమిలోమైనింగ్లీజులను 2022లోనే రద్దుచేశాం
– 2021లో 25 ఎకరాలదేవుడిమాన్యంనుదేవాదాయశాఖనుంచిఇద్దరులీజుకుతీసుకున్నారు
– భూమిలీజుకుతీసుకున్నవారుమైనింగ్కోసం దరఖాస్తు కూడా చేయలేదు
– అసలు మైనింగ్అనుమతులేలేకుండా 50 వేలటన్నులతవ్వకంసాధ్యమా?
– ఆ ప్రాంతంలో ఎటువంటిమైనింగ్జరగడం లేదు
– గతంలో జరిగినమైనింగ్ఫోటోలతో ‘ఈనాడు’ వక్రీకరణకథనం
– రాజకీయంగాబురదచల్లేందుకేప్రజాప్రతినిధిదోపిడీ అంటూ కట్టుకథ
– 50 వేలటన్నులక్వార్డ్జ్తవ్వకంఆరోపణలుఅర్థరహితం
-గనులశాఖసంచాలకులు శ్రీ విజివెంకటరెడ్డి
అమరావతి:
1) ఈనాడుదినపత్రికలో ‘క్వార్డ్జ్ కొల్లగొట్టారు’ అనేశీర్షికనప్రచురించినకథనం పూర్తి అవాస్తవమనిరాష్ట్రగనులశాఖసంచాలకులు శ్రీ విజివెంకటరెడ్డి ఒక ప్రకటనలోఖండించారు. ఈనాడు కథనంలో ఆరోపించినట్లుదేవుడిమాన్యంలోఎటువంటిమైనింగ్కార్యకలాపాలుజరగడం లేదని స్పష్టంచేశారు. అసలు మైనింగేజరగకపోతే, ఏకంగా 50 వేలటన్నులక్వార్ట్జ్తవ్వారనేఆరోపణలుఅర్థరహితమనిపేర్కొన్నారు.
2) పల్నాడుజిల్లాకారంపూడిమండలంసింగరుట్లలక్ష్మీనరసింహస్వామిఆలయభూముల్లోక్వార్జ్ట్తవ్వకాలకుమైనింగ్ శాఖ ఎటువంటిఅనుమతులు మంజూరు చేయలేదు. 2012లో దేవాదాయశాఖ ఈ ఆలయపరిధిలోనిబ్లాక్ 28 ప్రాంతంలో పదిఎకరాలభూమినిరమాదేవిఅనేవ్యక్తికిమైనింగ్కార్యకలాపాలకోసంలీజుకుఇచ్చింది. సదరు వ్యక్తి మైనింగ్ శాఖ నుంచిలీజుఅనుమతులుపొందారు. అయితే 2022లో ఈ మైనింగ్అనుమతులనుగనులశాఖరద్దు చేయడం జరిగింది.
3) 2021లో లక్ష్మీనరసింహస్వామిదేవాలయానికి చెందిన ఇరవైఅయిదుఎకరాలభూమినిమైనింగ్కార్యకలాపాలకోసంవినియోగించుకునేందుకుగానూదేవాదాయశాఖ అధికారులు వేలంనిర్వహించారు. ఈ వేలంలోఇరువురువ్యక్తులు 12.5 ఎకరాల చొప్పున వేలంలోదక్కించుకున్నారు. అయితేక్వార్జ్ట్తవ్వకాలకోసంసదరువ్యక్తులుమైనింగ్ అధికారులకు ఎటువంటి దరఖాస్తు చేయలేదు. ఈ ప్రాంతంలో క్వార్జ్ట్మైనింగ్లీజులనుగనులశాఖజారీ చేయలేదు.
4) వాస్తవాలు ఇలా ఉంటే… పల్నాడుకు చెందిన ప్రజాప్రతినిధిక్వార్జ్ట్మైనింగ్పేరుతోదోపిడీ చేశారని ‘ఈనాడు’ పత్రిక తన కథనంలో ఆరోపించడంవిడ్డూరంగాఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరగనిమైనింగ్నుంచిఏకంగా 50 వేలటన్నులకు పైగా తవ్వకం, ఎగుమతి కూడా జరిగిపోయినట్లుతన కథనంలో పేర్కొనడం పూర్తి అవాస్తవం. అసలు మైనింగ్అనుమతులేఇవ్వకపోతే… మైనింగేజరగకపోతే… ప్రభుత్వానికిరాయల్టీఎలా వస్తుంది? కేవలంఊహాత్మకఆరోపణలతోప్రభుత్వానికిరాయల్టీదక్కలేదంటూఈనాడు పత్రిక అభూతకల్పననుతనపత్రికలోఅచ్చేసింది.
5) రాష్ట్రంలోఅక్రమమైనింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకుప్రభుత్వం ప్రతి జిల్లాకు విజిలెన్స్స్వ్కాడ్లను ఏర్పాటు చేసింది. మైనింగ్పై ఎక్కడ ఆరోపణలువచ్చినా ఈ బృందాలుఆకస్మికతనిఖీలునిర్వహించి, బాధ్యులైనవారిపైచర్యలుతీసుకుంటున్నాయి. అలాగేఅన్ని చోట్ల చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేసిమైనింగ్అక్రమరవాణానుఅడ్డుకుంటున్నాం. ఇంతపకడ్భందీచర్యలుతీసుకుంటూఉంటేఇంతపెద్ద ఎత్తున క్వార్జ్ట్అక్రమమైనింగ్, రవాణాసాధ్యమా?
6) ఇటువంటి తప్పుడు కథనాలనుప్రచురిస్తూప్రభుత్వంపైప్రజల్లోఅపోహలుకల్పించేందుకఈనాడు పత్రిక ప్రయత్నిస్తోంది. కనీసంవాస్తవాలనుతెలుసుకునేందుకుసంబంధిత అధికారులను కూడా సంప్రదించకపోవడంసమంజసంకాదు. ఇటువంటి తప్పుడు రాతలపైఈనాడుపైచట్టపరమైనచర్యలుతీసుకుంటాం.