-
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు – రాష్ట్ర స్థాయి ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు, సమగ్ర చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధం
నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుస్థిర పాలనకు ఆర్థిక బలోపేతం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం అత్యవసరమని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో సమాజంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలు వంటి పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు, ప్రభుత్వ వ్యవస్థలకు, సామాజిక సామరస్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సాంప్రదాయ మీడియాకు చట్టపరమైన జవాబుదారీతనం, నైతిక ప్రమాణాలు, బాధ్యతలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికల్లో వాటి లోపం కారణంగా నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలు, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆలోచనా విధానాన్ని, పరిపాలనా వ్యవస్థపై నమ్మకాన్ని ప్రభావితం చేసే స్థాయికి సోషల్ మీడియా దుర్వినియోగం చేరుకుందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి గానీ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననంగా మారకూడదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ అంశంపై జరిగిన సమగ్ర సమీక్షా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలికలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అవమానకర ప్రచారం, అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననంపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టాల్లో ఉన్న అవకాశాలు, లోపాలను పరిశీలించి, చట్టపరమైన అన్ని మార్గాలను వినియోగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే నేరస్థులను చట్టపరంగా జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక Social Media Response Cell ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక State Task Force ఏర్పాటు అంశాలు ఉన్నట్లు తెలిపారు.
అదే విధంగా వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారం, దుష్ప్రచారం నిర్వహిస్తున్న సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించేందుకు అత్యాధునిక డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా నేరాలపై జిల్లా స్థాయి పోలీసు అధికారులు, ముఖ్యంగా SHOలకు ప్రత్యేక శిక్షణ, సైబర్ నేరాల దర్యాప్తు, న్యాయపరమైన వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (PPలు) నియామకంపై చర్యలు, అవసరమైతే సైబర్ నిపుణులను పోలీసు శాఖకు అనుసంధానించి ప్రభుత్వం అవసరమైన మద్దతు అందించడం జరుగుతుందన్నారు.
అలాగే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ అధ్యయన నివేదికను మంత్రివర్గం పరిశీలించి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అవసరమైన చట్టపరమైన, పరిపాలనా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణను ప్రభుత్వం గౌరవిస్తుందని, అయితే ఆ స్వేచ్ఛ పేరుతో అసత్య ప్రచారం, అశ్లీలత, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం, వ్యక్తిత్వ హననం, సామాజిక విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు.
అనంతరం క్యాబినెట్ లో తీసుకున్న పలు నిర్ణయాలను వివరిస్తూ…
1. యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
రాష్ట్రంలో కచేరీలు/కన్సర్ట్‌ల నిర్వహణ మరియు ప్రోత్సాహానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29కి అనుబంధం (అడెండం) చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2. యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
తే.20.05.2025న G.O.Rt. No.99, YAT&C (T) ఉత్తర్వుల ప్రకారం పర్యాటక శాఖకు మంజూరు చేసిన 50 కోట్ల రూపాయల నిధుల సవరించిన కేటాయింపులు మరియు వినియోగాన్ని ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
3. యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
నెల్లూరు జిల్లా అకుతోటలో ITC వారి వెల్‌కమ్ హోటల్స్ బ్రాండ్ కింద 4-స్టార్ హోటల్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం M/s DSR హాస్పిటాలిటీ సర్వీసెస్‌కు ప్రోత్సాహకాలు అందించడానికి తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
4. యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
YSR కడప జిల్లా కడపలో మాధవి బ్రాండ్ కింద 3-స్టార్ హోటల్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం M/s మాధవి లెజర్ అండ్ స్టేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు అందించడానికి తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
5. యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ అభివృద్ధి కోసం M/s శ్రీనివాసం అమ్యూజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు అందించడానికి తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
6. యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ:
NTR జిల్లా విజయవాడ MG రోడ్డులో సరోవర్ పోర్టికో బ్రాండ్ కింద మిక్స్‌డ్-యూజ్ హోటల్, బ్యాంక్వెట్ & ఎగ్జిబిషన్ సెంటర్ అభివృద్ధి కోసం M/s వజ్ర హాస్పిటాలిటీ LLPకు సంబంధించి తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
7. సాంఘిక సంక్షేమ శాఖ:
ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (APSWREIS) ఆధ్వర్యంలో IIT-JEE మరియు NEET పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు (i) విశాఖపట్నం జిల్లా మేగాద్రిగడ్డ, (ii) గుంటూరు జిల్లా తాడికొండ, మరియు (iii) నెల్లూరు జిల్లా కోటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం పేరిట మూడు (3) సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు మార్గం సుగమం కానుంది.
8. జలవనరుల శాఖ:
“పెద్దగెడ్డ రిజర్వాయర్ ప్రాజెక్ట్ రైట్ మెయిన్ కెనాల్ కింద మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ వర్క్స్ (M-CADWM) స్కీమ్-WUA 3,4,5,6 క్లస్టర్ల” పనికి సంబంధించి, తే.20.11.2004 నాటి G.O. Ms.No.133, I & CAD శాఖ ప్రకారం ఉన్న 5% సీలింగ్‌ను మించి IBM కంటే 14.88% ఎక్కువగా కోట్ చేసిన టెండర్‌ను ఆమోదించడానికి మరియు సదరు పనికి షార్ట్ టెండర్ నోటీసు జారీ చేయడంలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజనీర్ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
9. నీటి వనరుల శాఖ:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండి లిఫ్ట్ మరియు గ్రావిటీ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని అందించేందుకు ఫీడర్ ఛానెళ్ల నిర్మాణం మరియు 0.025 TMC సామర్థ్యంతో బీరగానిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనికి రూ.67.98 కోట్లతో పరిపాలనా ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
10. వ్యవసాయ & సహకార శాఖ:
గతంలో జారీ చేసిన G.O.Ms.No.24 (వ్యవసాయం & సహకారం మార్కెటింగ్-III శాఖ) ఉత్తర్వులకు సవరణలు చేస్తూ, ప్రభుత్వ హామీతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) నుండి రూ.1800.00 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (AP MARKFED)కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ రుణంలో (i) రబీ 2025-26 (KMS 2025-26) సీజన్‌లో ధాన్యం సేకరణ, DCP మరియు PDS కార్యకలాపాల వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ.1600 కోట్లను AP స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL)కు, మరియు (ii) ఖరీఫ్ 2026 విత్తన సేకరణ మరియు పంపిణీ కార్యకలాపాలను ప్రారంభించి, RSKS/PACS/DCMS నెట్‌వర్క్ ద్వారా రాష్ట్ర రైతుల ప్రయోజనార్థం విత్తన పంపిణీ సజావుగా జరిగేలా చూసేందుకు రూ.200 కోట్లను AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDCL)కు ఇంటర్-కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
11. వ్యవసాయ & సహకార శాఖ:
AP MARKFEDలో ప్రభుత్వ వాటా మూలధనాన్ని రూ.30 కోట్లకు పెంచే ప్రతిపాదనకు (అంటే ప్రస్తుతం ఉన్న రూ.20 కోట్లకు అదనంగా రూ.10 కోట్లు) రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
12. పరిశ్రమలు, & వాణిజ్య శాఖ:
తే.04.12.2025నాటి G.O.Ms.No.229, పరిశ్రమలు & వాణిజ్య (Prog-III) శాఖ ద్వారా మంజూరు చేయబనడిన ఆరుగురు యంగ్ ప్రొఫెషనల్స్ స్థానంలో కొత్తగా ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్-1, ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్-2 మరియు ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను AP ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (APFPS)కి మంజూరు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
13. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
తిరుపతి జిల్లా శ్రీసిటీలో ప్రస్తుతం ఉన్న చాక్లెట్ తయారీ యూనిట్‌ను రూ.1801.00 కోట్ల పెట్టుబడితో విస్తరించి, తద్వారా 80 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే విధంగా M/s మొండెలీజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీతో కూడిన టైలర్-మేడ్ ప్రోత్సాహకాలు అందించేందుకు తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
14. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
చిత్తూరు జిల్లా కుప్పంలోని గుడిపల్లి మరియు శాంతిపురం మండలాల్లో రూ.1,137.58 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానెల్ తయారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా 350 మందికి ఉపాధి కల్పించే విధంగా M/s అవెరాన్ ప్యానెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన పెట్టుబడి ప్రతిపాదనపై తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
15. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
రూ.1356.22 కోట్ల పెట్టుబడితో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా 100+ మందికి ఉపాధి కల్పించే విధంగా M/s SAF వన్ ఇండియా SPKompact ప్రైవేట్ లిమిటెడ్‌కు టైలర్-మేడ్ ప్రోత్సాహకాలు మంజూరు చేసేందుకు తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
16. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడ (V)లో ప్రీమియర్ స్కిల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కోసం ఉన్నత విద్యా శాఖ ద్వారా M/s అదానీ ఫౌండేషన్ గ్రూప్‌కు ఎకరానికి రూ.15 లక్షల రాయితీ ధరతో 60.29 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనకు సంబంధించి తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
17. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
అనకాపల్లి జిల్లా పర్వాడ ఇండస్ట్రియల్ పార్క్ లో రూ.1600 కోట్ల పెట్టుబడితో 3.5 GW సోలార్ సెల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా 750 మందికి ఉపాధి కల్పించే విధంగా M/s అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.65 లక్షల రాయితీ ధరతో 34.02 ఎకరాల భూమిని కేటాయించేందుకు, అలాగే అదే స్థలంలో సాధారణ MSME పార్క్‌కు బదులుగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) నిర్మించడంతో పాటు పెద్ద MSME పార్క్ అభివృద్ధికి పరవాడ ప్రాంతంలో అనువైన భూమిని గుర్తించాలని APIICకి ఆదేశించేందుకు తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
18. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
విశాఖపట్నం జిల్లా కనమంలో లాజిస్టిక్స్ మరియు లైట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం M/s ఎకోబాక్స్ ఇండస్ట్రియల్ అసెట్ IV ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.55 లక్షల చొప్పున 91.38 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనకు సంబంధించి తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
19. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు M/s జియోమైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు LA for others పాలసీ కింద 998.10 ఎకరాలను సేకరించి కేటాయించేందుకు, అలాగే దేవాదాయ శాఖ అంగీకారం మేరకు 40.12 ఎకరాల దేవాదాయ భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
20. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో రూ.1200 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ మాంగనీస్ సింటర్ ప్లాంట్, డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ (DRI) ప్లాంట్ మరియు కార్బన్ పేస్ట్ ప్లాంట్ ఏర్పాటు కోసం M/s బెర్రీ అలాయ్స్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.77.25 లక్షల రాయితీ ధరతో 93.43 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనకు సంబంధించి తే.07.07.2026న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
21. సాధారణ పరిపాలన (సమాచార & పౌరసంబంధాల శాఖ):
గౌరవ HRD & ITE&C, RTGS శాఖా మంత్రివర్యుల కార్యాలయంలో ప్రొఫెషనల్ కెమేరామెన్ గా పని చేసేందుకు నెలకు రూ.70,000/- పారితోషికంతో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన (కోటర్మినస్) ఒక (01) ప్రొఫెషనల్ కెమేరామెన్ పోస్టును సమాచార & పౌరసంబంధాల శాఖకు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
22. మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ:
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నేటివాకం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు కోసం (a) సంబంధిత భూ యజమానుల అంగీకారం పొందిన అనంతరం 63.01 ఎకరాల భూమిని సేకరించేందుకు APMBకు అనుమతి ఇవ్వడానికి, (b) APMB భూమి కేటాయింపు మార్గదర్శకాల ప్రకారం ఆ భూమిని M/s నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్‌కు ఎకరానికి రూ.28,00,000/- చొప్పున అవుట్‌రైట్ సేల్ ప్రాతిపదికన కేటాయించేందుకు APMBకు అధికారం ఇవ్వడానికి, మరియు (c) ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ, 2026లో నిర్దేశిత షరతులకు లోబడి, ఆ పాలసీ కింద ఈ ప్రాజెక్ట్‌కు వర్తించే ప్రోత్సాహకాలను అందించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భూమి సేకరణ, నిర్మాణాలు, పరిపాలనా ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు మరియు అభివృద్ధికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని డెవలపర్ భరించాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టు కింద 63.01 ఎకరాల విస్తీర్ణంలో వేర్‌హౌసింగ్ బ్లాకులు, పారిశ్రామిక మరియు తయారీ యూనిట్లు, కంటైనర్ యార్డ్, ట్రక్ టెర్మినల్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు మరియు అనుబంధ మౌలిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. సుమారు 15 లక్షల చదరపు అడుగుల మొత్తం బిల్ట్-అప్ విస్తీర్ణంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టును రూ.255 కోట్ల మొత్తం పెట్టుబడితో (35% ప్రమోటర్ ఈక్విటీ రూ.89.25 కోట్లు మరియు 65% టర్మ్ లోన్ రూ.165.75 కోట్లు) రెండు దశల్లో 5 సంవత్సరాల కాలంలో (మొదటి దశ 3 సంవత్సరాల్లో, రెండో దశ 2 సంవత్సరాల్లో) పూర్తి చేయనున్నారు. దీని ద్వారా సుమారు 1,000 మందికి (400 ప్రత్యక్ష, 600 పరోక్ష) ఉపాధి లభించనుంది.
23. న్యాయ శాఖ:
NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో జిల్లా & సెషన్స్ జడ్జి స్థాయిలో, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అధికార పరిధి కలిగిన ఒక (1) ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు, భారత ప్రభుత్వం నుండి రీయింబర్స్ చేయదగిన అంశాల వ్యయాన్ని తగిన రీతిలో బుక్ చేసే షరతుకు లోబడి (16) పోస్టులను మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
NIA కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టుల (ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కోర్టుల) ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (లీగల్) తే.25.02.2026నాటి లేఖ ద్వారా, అలాగే గౌరవ సుప్రీంకోర్టు తే.10.02.2026 నాటి ఉత్తర్వుల ద్వారా అన్ని రాష్ట్రాలను ఆదేశించాయి. దీనికి అనుగుణంగా, విశాఖపట్నంలో NIA కేసుల విచారణకు జిల్లా & సెషన్స్ జడ్జి స్థాయిలో యావత్ రాష్ట్రంపై అధికార పరిధి కలిగిన ఒక ప్రత్యేక కోర్టును 16 పోస్టులతో త్వరితగతిన మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తే.28.04.2026 నాటి లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కోర్టు మంజూరైన అనంతరం స్పెషల్ జడ్జి పోస్టును జిల్లా & సెషన్స్ జడ్జిల కేడర్ బలంలో చేర్చడం జరుగుతుంది.
24. న్యాయ శాఖ:
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో జిల్లా జడ్జి కేడర్‌లో రూ.1,33,900-1,79,000 పే స్కేల్‌తో రెగ్యులర్ ప్రాతిపదికన ఒక రిజిస్ట్రార్ (కోర్ట్ అండ్ కేస్ మేనేజ్‌మెంట్) పోస్టు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
గౌరవ సుప్రీంకోర్టు సుమోటో రిట్ పిటిషన్ (క్రిమినల్) నెం.4/2021లో జారీ చేసిన ఉత్తర్వులు, అలాగే సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తుల కేస్ ఫ్లో మేనేజ్‌మెంట్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జిల్లా జడ్జి కేడర్‌లో రిజిస్ట్రార్ (కోర్ట్ అండ్ కేస్ మేనేజ్‌మెంట్) పోస్టును సృష్టించాలని రాష్ట్ర కోర్టు మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ కమిటీ గౌరవ న్యాయమూర్తులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ పోస్టును రెగ్యులర్ ప్రాతిపదికన సృష్టించాలని ప్రభుత్వాన్ని కోరగా, తదనుగుణంగా మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
25. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపుపై కొత్త ప్రతిపాదనలు మరియు గత కేటాయింపుల సమీక్షకు సంబంధించి తే.07.07.2026నాటి APCRDA అథారిటీ తీర్మానం నెం.678/2026 ద్వారా ఆమోదించిన విధంగా మంత్రుల బృందం (GoM) 27వ సమావేశ సిఫార్సులను ఆమోదించడానికి మరియు అమరావతి భూమి కేటాయింపు రూల్స్, 2017 మరియు అమరావతి భూమి కేటాయింపు రెగ్యులేషన్స్, 2017 నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి APCRDA కమిషనర్‌కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
26. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
తే.07.07.2026నాటి APCRDA అథారిటీ తీర్మానం నెం.674/2026 ద్వారా ఆమోదించిన విధంగా, తే.12 జూన్ 2024 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ (ఫారం 9.14) అమలు చేసిన క్యాపిటల్ సిటీ LPS భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000/- నుండి రూ.40,000/-కి మరియు జరీబు భూములకు ఎకరానికి రూ.50,000/- నుండి రూ.60,000/-కి పెంచేందుకు, తే.01.01.2015నాటి G.O.Ms.No.1, పురపాలక & పట్టణాభివృద్ధి (M2) శాఖ ద్వారా జారీ చేసి తే.9.3.2015 నాటి G.O.Ms.No.43 ద్వారా సవరించిన AP క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ & ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2015 లోని రూల్ 5(2)(c)కి సవరణ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
27. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
తే.07.07.2026నాటి APCRDA అథారిటీ తీర్మానం నెం.675/2026 ద్వారా ఆమోదించిన విధంగా, 634 ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు 12 నెలల కాలానికి చెల్లించే సబ్సిస్టెన్స్ గ్రాంట్‌ను (అద్దె కల్పనతో సహా) నెలకు రూ.5,000/- నుండి నెలకు రూ.10,000/-కి పెంచేందుకు, తే.19.04.2017నాటి G.O. Ms.No.153, పురపాలక & పట్టణాభివృద్ధి (CRDA.2) శాఖ ద్వారా జారీ చేసి తే.31.12.2018 నాటి G.O.Ms.No.420 మరియు తే.29.07.2025 నాటి G.O.Ms. No.142 ద్వారా సవరించిన నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీలోని పేరా 3(g)కి సవరణ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
28. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
తే.07.07.2026నాటి APCRDA అథారిటీ తీర్మానం నెం.676/2026 ద్వారా ఆమోదించిన విధంగా, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు మరియు పల్నాడు జిల్లాల ఏడు గ్రామాల్లో రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడానికి, పథకం అమలుకు మార్గదర్శకాలను రూపొందించడానికి మరియు బకాయి వ్యవసాయ రుణాల అర్హత నిర్ణయానికి APCRDA చట్టం, 2014లోని సెక్షన్ 55(4) కింద జారీ చేసిన మొదటి నోటిఫికేషన్ తేదీ అయిన తే.06.01.2026ను కటాఫ్ తేదీగా స్వీకరించడానికి APCRDA కమిషనర్‌కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
29. వ్యవసాయ & సహకార శాఖ:
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం AP OIL FEDకి చెందిన 2 ఎకరాల భూమిని దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
30. రెవెన్యూ శాఖ:
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నౌలూరు గ్రామంలో సర్వే నెం.791/4లో 0.50 ఎకరాల భూమిని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీకి ఏడాదికి రూ.1,000/- చొప్పున (66) సంవత్సరాల లీజు ప్రాతిపదికన, (99) సంవత్సరాల వరకు పొడిగించే విధంగా దాఖలా పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
31. రెవెన్యూ శాఖ:
అనంతపురం జిల్లా రాయదుర్గం (V&M)లో 50 సెంట్ల భూమిని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ (TDP)కి ఏడాదికి రూ.1,000/- చొప్పున (66) సంవత్సరాల లీజు ప్రాతిపదికన, (99) సంవత్సరాల వరకు పొడిగించే విధంగా దాఖలా పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
32. రెవెన్యూ శాఖ:
తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో సర్వే నెం.48-3, 48-4 తదితరాల్లో 21.10 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం APTA, విజయవాడకు ఎకరానికి రూ.90,00,000/- చెల్లింపుపై బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
33. రెవెన్యూ శాఖ:
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 7.75 ఎకరాల మేర M/s శ్రీ సప్తగిరి ఇండస్ట్రియల్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా, కార్యకలాపాల తీరును “కెమికల్ సాల్వెంట్ ఇండస్ట్రీ ఏర్పాటు” నుండి “వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, వ్యవసాయేతర ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల ఏర్పాటు మరియు ఇతర గోడౌన్లు”గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
34. రెవెన్యూ శాఖ:
(i) వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామం (H/o కొర్నెపాడు)లో LPM నెం.1922 (పాత సర్వే నెం.443/1, 10.04 ఎకరాలతో సంబంధం కలిగిన) లో 10.16 ఎకరాల భూమిని AP పంచాయతీ రాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 58(2) కింద పుల్లడిగుంట గ్రామ పంచాయతీ పరిధి నుండి డీ-నోటిఫై చేయడానికి, మరియు (ii) వర్గీకరణను “టోపు పోరంబోకు” నుండి “పట్టా/AWD/GP”గా మార్చడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
35. పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ:
(1) (i) రూ.9,355.00 కోట్ల అంచనా వ్యయంతో 10 మల్టీ విలేజ్ స్కీమ్‌లకు మరియు (ii) జల్ జీవన్ మిషన్ (లేదా) ఇతర అందుబాటులో ఉన్న నిధుల సమీకరణకు లోబడి తీవ్ర నీటి కొరత ఉన్న ఆవాసాలకు తాగునీరు అందించేందుకు SDS (ప్లెయిన్) కింద రూ.1811.81 కోట్ల అంచనా వ్యయంతో 2943 పనులకు పరిపాలనా అనుమతి ఇవ్వడానికి, మరియు (2) తే.26.03.2026నాటి G.O.Ms.No 53 మరియు 54 ద్వారా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.















































