ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఎంపీల స్వాగతం
– ఎంపీలతో ప్రత్యేక సమావేశం
న్యూఢిల్లీ, మే 11 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రంతో సమన్వయం అంశాలపై కీలక చర్చల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎంపీలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తదితర ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మరింత సమన్వయం పెంచుకుని రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించినట్లు సమాచారం














































