బంగారుపాళ్యంలో వై ఎస్ జగన్ పర్యటన వైసీపీ దండుపాళ్యం పర్యటనలా ఉంది.
– అడుగడుగున వైసీపీ దండుపాళ్యం బ్యాచ్ ను అడ్డుకుంటున్న రైతులు.
– ఉద్రిక్తతలు స్పృష్టించేందుకు జగన్ పర్యటనలు చేస్తున్నారు.
– జగన్ ప్రజల తీర్పును గౌరవించాలి, రాజకీయ డ్రామాలు ఆపాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మండి పాటు …
వై ఎస్ జగన్ పర్యటన రైతుల కోసం కాదు..రాజకీయం కోసమే జగన్ పర్యటన
మామిడి రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
గత ఏడాది తోతాపురి మామిడి ఉత్పత్తి 2.5 లక్షల మెట్రిక టన్నులు మాత్రమే వచ్చింది.
ఏడాదిలో ఏకంగా 6.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు ధర విషయంలో ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నాం
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతులకు అండగా ఉంటూ మద్దతు ధర ను ప్రకటించారు.
చిత్తూరు జిల్లా యంత్రాంగం
రైతులకు మద్దతు ధర అందించడంలో అన్ని చర్యలు చేపడుతోంది.
ఇప్పుడు కాదు నెలన్నర రోజుల నుంచే మామిడి రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నాం.
దీంట్లో భాగంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల క్రితమే ప్రభుత్వం వైపు నుంచి మామిడి పంటకు మద్ధతు ధర ప్రకటించాం
కిలోకి రూ.4 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. రూ.8 తగ్గకుండా పల్స్ ఫ్యాక్టరీలు, ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూస్తున్నాం. మొత్తంగా మామిడి రైతులకు కనీసం కిలోకి రూ.12 రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకున్నాం
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మద్ధతు ధర ప్రకటించడమే కాకుండా కేంద్రం నుంచి సాయం కోసం లేఖలు రాశాం
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర వాటాగా రూ.130 కోట్లు ఇవ్వాలని గత నెలలోనే కేంద్రానికి లేఖ రాశాం
ఇప్పటి వరకూ చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3,08,261 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, పల్ ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేశాయి
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల మెట్రిక్ టన్నులు, అన్నమయ్యలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి.
ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయం జరిగింది.
ఇప్పటి వరకూ మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు జరిగాయి
దీంతో పాటు ఏపీలోని మామిడి రైతులు ఇబ్బంది పడకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే తోతాపురి మామిడిని రాష్ట్రంలోకి రానివ్వ లేదు.
రైతుల విషయంలోనే కాదు పల్ప్ పరిశ్రమల యాజమాన్యాల ఇబ్బందులనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
మ్యాంగో పల్స్ పై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశాం.
జగన్ పరామర్శ రాజకీయాలు..
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే జగన్ రాజకీయాలు చేస్తున్నారు
రైతుల పేరుతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు… ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ప్రజలకు మేము అండగా ఉంటాం.
పరామర్శలు చేసుకోవచ్చు, నిరసనలు తెలపవచ్చని ఇప్పటికే చాలా సార్లు చెప్పాం.
కానీ జగన్ బుద్ధిమాత్రం మారటం లేదు. ఆ పార్టీ వైఖరి కుక్కతోక వంకర సామెతలానే ఉంది.
కారు కింద వేసి కార్యకర్తను తొక్కి చంపేసిన జగన్ మళ్లీ రైతుల పేరుతో వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు
చిత్తూరు జిల్లాలో రైతులను పరామర్శించడానికే జగన్ వెళ్లేట్టు అయితే బలప్రదర్శన తరహాలో వెళ్లడం ఎందుకు?
జన సమీకరణ టార్గెట్లు, వాహనాల మొహరింపు, బలప్రదర్శన ఎందుకు?
తోతాపురి మామిడితో సంబంధం లేని కడప జిల్లా నుంచి కార్యకర్తల్ని ఎందుకు తరలిస్తున్నారు?
రైతుల పరామర్శకే అయితే మండలాల వారీగా కార్యకర్తల సమీకరణ ఎందుకు?
బంగారుపాళ్యానికి కార్యకర్తల్ని భారీగా తరలిస్తారా?
చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల నుంచి 25 వేల మంది కార్యకర్తల్ని తరలించాల్సిన అవసరం ఉందా?
దీని కోసం 90 బస్సులు , 1810 కార్లు, వ్యాన్లు , 2230 బైకులతో దండయాత్ర చేస్తారా?
రైతుల కోసం అని చెబుతున్నారు. మీతో వచ్చే రైతులు గట్టిగా 100 మంది కూడా లేరు
టార్గెట్లు ఎందుకు ? మండల స్థాయి లీడర్లకు టార్గెట్ ఎందుకు?
ప్రతీ మండలం నుంచి వందల కార్లతో రావాలని కార్యకర్తలకు ఎందుకు చెప్పారు. ? ఈసారి ఎవరిని కారు కింద తొక్కించేస్తారు? మీ రాజకీయ కార్యక్రమాలకు పరామర్శలను వేదికగా చేసుకుంటావా?
రైతుల పేరుతో జగన్ పరామర్శకు వెళ్లిన చోట్ల ఏం జరిగిందో చూశాం
గుంటూరు మిర్చియార్డులో పరామర్శకు వెళ్లి మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్లిపోయారు.
పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్లి పొగాకు బేళ్లు తొక్కి నాశనం చేశారు
ఇప్పుడు మామిడి రైతులను ఏం చేద్దామని ఈ దొంగ పరామర్శలు? నీ రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు
పరామర్శకు వచ్చే ముందు జగన్ ఒక ప్రశ్నకు జవాబులు చెబితే బాగుంటుంది.
పెద్దిరెడ్డి కన్నసన్నల్లో ఉన్న పల్ప్ ఫ్యాక్టరీలు కొద్దిరోజుల పాటు మామిడి కొనుగోలు చేయకుండా చేసింది వాస్తవం
అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏనాడు పట్టించుకోని జగన్ అధికారం పోయాక తన రాజకీయం కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
తాను చేపట్టీ ప్రతీ పర్యటనలోనూ శాంతిభద్రతల సమస్య సృష్టించడమే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.
అందుకే పరామర్శకు 10 వేల మంది, 20 వేల మంది అంటూ ప్రకటనలు చేస్తున్నాడు. వైసీపీ కుట్రలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాము.