జలమే భారతా వని బలమని ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పిన ధార్సనికుడు , అపర భగీరధుడు జనరల్ సర్ ఆర్ధర్ కాటన్ జయంతి నేడు
“నిత్య గోదావరీ స్నాన పుణ్యధోయో మహామతిః స్మరామ్యాంగ్లేయదేశీయం, కాటనుం తం భగీరధం”
“పవిత్ర గోదావరి జలాలతో అనుధినం స్నానపానులాచరించ గల పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు, భగీరధతుల్యుడు, ఆంగ్లదేశీయుడైన కాటన్ దొరను ఉద్దేశించి ఒక వేధ పండితుడు చేసిన స్తుతి ఇది..
ఆంగ్లేయులంటే వ్యతిరేకత ఉన్నరోజుల్లో ఒక భారతీయుడు ఆంగ్లదొరను కొనియాడడమంటే కారణం ఉండితీరాలి..
అన్నపూర్ణ అని పిలవబడే ఉభయ గోదావరి జిల్లాలు ఒకప్పుడు నిత్యం క్షామాంతో అల్లాడుతూండేవి. అతివృష్టి, అనవృష్టితో జిల్లావసులు (మన తాత, ముత్తాతలు) అనేక మంది మృత్యువాత పడ్డారు. ఆకలికి తమ పిల్లలను సైతం అమ్ముకునే పరిస్తితి ఉండేది 1831-40 సం.. మద్యకాలంలో.. దీనికి పరిష్కారంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ కాటన్కు అప్పగించింది. జనరల్ కాటన్ ఉభయ గోదావరి ప్రాంతాన్ని సర్వే చేసి డెల్టాప్రాంత అభివృద్దితో క్షామాన్ని అరికట్టవచ్చని గోదావరినది లోతూ, ప్రవాహ వేగాన్ని లెక్కగట్టారు.. కాల్వ మార్గాన్ని, భూమటాన్ని, నిర్ణయించారు. రోజుకి సుమారు 15 మైళ్ళు గురంపై తిరిగి ఆనకట్ట నిర్మాణానికి రూ. 475572లు, పంటకాలువల మరమత్తులకు రూ. 15 వేలు మంజూరు చేశారు. 1847 ప్రారంభమైన పనులు ఎన్ని ఆటంకాలొచ్చినా ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని 1882లో పూర్తిచేసారు. కృష్ణనదిపై ఆనకట్ట నిర్మించడంలో, విశాక పోర్ట్ నిర్మాణంలో కాటన్మహశయుడు సేవలను అందించారు. క్షామంలో ఉన్న ఈ ప్రాంతాన్ని వ్యవసాయానికి క్షేమంగా తీసుకొచ్చిన ఘనత కాటన్కి దక్కుతుంది.
తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఖరీఫ్లో 220933 హెక్టర్స్ వరి, సార్వలో 258993 హెక్టర్స్ లో పంటలు సాగు జరుగుతున్నదంటే కాటన్ మహశయుడు పుణ్యఫలమని ఇక్కడ రైతన్నాల విశ్వాసం.. అందుకే ఈ ప్రాంత ప్రజలు కాటన్దొర విగ్రహాలు కట్టి.. పూలమాలలు వేయడమే కాదు పాలాభిషాకాలు, నవ ధాన్యాలతో పూజలు చేస్తారు.
సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడుని స్మరించుకుంటూ.. వారి జయంతి శుభాకాంక్షలతో..
తూతిక శ్రీనివాస విశ్వనాధ్, MBA, LLM, మాజీ సైనికుడు
Today is the birth anniversary of General Sir Arthur Cotton, Apara Bhagiradha, the visionary who said many years ago that water is the strength of India.
“Nitya Godavari snan punyadhoyo mahamatih smaramyangleyadeshiyam, katanum tam bhagiradham”
“This is the eulogy of a Vedic scholar addressing the noble Bhagiradhatulya, Englishman Cotton Dora, who bestowed upon us the gift of bathing in the waters of the holy Godavari.
In the days when there was opposition to the English, there must be a reason for an Indian to praise the British.
Both the Godavari districts known as Annapurna were once plagued by perpetual famine. Many people of the district (our grandfathers and great-grandfathers) died due to heavy rains and droughts. During 1831-40, there was a situation of selling even their own children for starvation. The then British government entrusted General Cotton as a solution to this. General Cotton surveyed both the Godavari region and calculated the depth and flow velocity of the Godavari river to prevent famine by developing the delta region. About 15 miles per day for the construction of a dam back on the river at a cost of Rs. 475572s, for repairs of crop canals Rs. 15 thousand was sanctioned. The construction of the dam at Dhavaleswaram was completed in 1882 despite many obstacles that started in 1847. Katanamahasayudu rendered services in the construction of a dam on the Krishna river and in the construction of Visakha port. Cotton is credited with bringing this famine-stricken region safe for agriculture.
Farmers in East Godavari district are cultivating 220933 hectares of rice in Kharif and 258993 hectares in Sarva. Farmers here believe that Cotton Mahasayu is a holy fruit. That is why the people of this region not only build idols of cotton and garland them but also worship them with milk and new grains.
Remembering Sir Arthur Cotton Mahasayadu.. with best wishes on his birthday..
Tuthika Srinivasa Viswanath, MBA, LLM, Ex-Serviceman