రష్యా రాజకీయాలు – పుతిన్ VS యులియ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వ్యతిరేకి,అలెక్సీ నవల్నీ ఆశయాల సాధన కోసం పనిచేస్తానని ఆయన భార్య యులియ నవల్నీ చెప్పారు. అలెక్సీ నవల్నీ ఫిబ్రవరి 16న అనుమానానస్పదంగా జైల్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో 5 వేల మందిని అరెస్టు చేశారు. పుతిన్ తన భర్తను చంపించాడని దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాలోనూ.. అంతర్జాతీయంగానూ తలెత్తిన రాజకీయ సమస్యలను మహిళా ప్రత్యర్థి యులియ నవల్నీ మాత్రమే ఎదుర్కోగలరని రష్యా ప్రజలు నమ్ముతున్నారు. అక్కడి రాజకీయాలపై సమగ్ర వివరాలు తెలుసుకుందాం..
అలెక్సీ నావల్నీ 2011లో లాభాపేక్ష లేని సంస్థ యాంటీ కరెప్షన్ ఫౌండేషన్ FBK ను నెలకొల్పారు. ప్రస్తుతం FBK తరపున ఆమె తన పనిని కొనసాగిస్తానని, ఆయన చనిపోయిన మూడో రోజునే ఆమె ప్రకటించారు. రష్యన్ ఉన్నత వర్గాల మధ్య లంచం, అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసులను వెలికితీసి ప్రచారం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఈ ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం రష్యా అధికారులు చేసిన ప్రతీకారచర్యలు, వేధింపుల ఫలితంగా సైబీరియా జైల్లో 47 ఏళ్ల నవల్నీ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన ఆశయసాధన కోసం భార్య యులియ నవల్నీ రాజకీయ కేరీయర్ ను ఎంచుకుంది. వాస్తవానికి ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు. ఇప్పుడు రష్యన్ ప్రజలు కొత్త ప్రత్యర్థి పై అనేక ఆశల్ని పెట్టుకున్నారు.
రష్యన్ ప్రజల ఆశలు
యులియ అబ్రోసిమోవ – అలెక్సీ నవల్నీ 1998లో సెలవు రోజుల్లో టర్కీలో కలిశారు. వారు 2000 సంవత్సరం వివాహం చేసుకున్నారు. తర్వాతి ఏడాది కూతురు దరియా పుట్టింది. కుమారుడు జాకర్ 2008 లో పుట్టాడు. 2000 సంవత్సరంలోనే వీరిద్దరూ యబ్లోకో పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. మాస్కోలోని ఫెక్ నోవ్ యూనివర్సిటీ నుంచి నవల్నీ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. డెన్మార్క్ లోని బిజినెస్ స్కూల్ లో ఇంటర్న్ షిప్ పూర్తి చేశాడు. యులియ నవల్నీ తన సొంత కేరియర్ ను ఎంచుకోలేదు. అయితే భర్త రాజకీయ జీవితంలో తోడుండాలి అని భావించింది. దీనిపై ఒక మాగజైన్ తో ఆమె మాట్లాడుతూ పైకి కనిపించకుండా అలెక్సీకి సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు.
నావల్నీ అరెస్టు
2011 డిసెంబరులో ఎన్నికలు పారదర్శకత్వంగా జరగాలని ర్యాలీ జరుపుతుండగా నావల్నీ అరెస్టు అయ్యారు. ఆయన కోసం భార్య, స్నేహితులు మాస్కోలోని అనేక నిర్భంద కేంద్రాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే రెండు వారాల తర్వాత నావల్నీ విడుదల అయ్యారు. 2013లో ప్రభుత్వానికి చెందిన కలప కంపెనీలో 35 వేల డాలర్ల మేరకు నష్టం కలిగించారని ఆయన కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ప్రజలు ఈ అసత్యాన్ని నమ్మలేదు సరికదా.. ఆయనకు బ్రహ్మరధం పట్టారు.యులియ నవల్నీని అక్కడి ప్రజలు ఫస్ట్ లేడీగా సంభోదిస్తారు.
మేయర్ గా పోటీ చేస్తే ఆయనకు 27 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఆయన రాబడి, కుటుంబ ఆస్తులు ప్రకటించి ఆయన రాజకీయాల్లో రావడంతో ఆయన పారదర్శకత అందరికీ నచ్చింది. 2020 లో ఆయనపై విషప్రయోగం జరిగింది. దీంతో ఆయనను జర్మనీలో చికిత్సకు అనుమతించాల్సిందిగా యులియ నవల్నీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అర్జించింది. అయితే దేశం విడిచి వెళ్లి పోవాల్సిందిగా ప్రాసిక్యూటర్స్ వారిని ఆదేశించారు. ఇది ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రస్తుతం నావల్నీ చనిపోయారు. దీంతో ఆయన స్థానాన్ని తాను భర్తీ చేయనున్నట్లు యులియ నవల్నీ చెప్పారు. పురుష రాజకీయ దౌర్జన్యాలను ఎదుర్కొంటానికి ఆమె సరిపోతారని పొలిటికల్ సైంటిస్ట్ డిమిత్రి ఒరేష్కిన్ అన్నారు. దేశంలోని చాలా మంది పురుషులు నాటో రష్యాపై దాడి చేయబోతోందని నమ్ముతున్నారు. ఇటు వంటి పరిస్థితుల్లో మహిళలైతేనే సమర్థవంతంగా ఎదుర్కొంటారని ప్రజలు భావిస్తున్నారు. భర్తలు చంపబడ్డారు. సోదరులు ఆర్మీలో ఉన్నారు. కుమారులు చనిపోవడానికి ఉక్రెయిన్ ను పంపుతున్నారని ప్రజలు బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నావల్నీ మాత్రమే ఇంటా బయట సమస్యలను పరిష్కరించగల వ్యక్తిగా రష్యన్లు భావిస్తున్నారు. వాషింగ్టన్‌లోని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలో ఆండ్రీ కొలెస్నికోవ్ మాట్లాడుతూ యులియ నవల్నీని ఉక్కు మహిళగా మిలియన్ల ప్రజలు భావిస్తున్నారన్నారు.
ఆమె కసి కోపం ద్వేషం
రష్యా భవిత్ ను నాశనం చేస్తున్న వారిపై ఆమె కసి, కోపం, ద్వేషం, నూతన రష్యాను పునర్నిర్మించేందుకు దోహదపడతాయన్నారు. వాస్తవానికి ఇవన్నీ అలక్సీ నావల్నీ కలలని వాటిని సాకారం చేసే శక్తి యులియ నవల్నీ కే ఉందన్నారు. ఆమె మాత్రమే గౌరవం, న్యాయం, ప్రేమతో సాధించగలరన్నారు. ఆమె ఎన్నటికీ తన పోరాటాన్ని ఆపబోదని,ప్రతిఘటనా చిహ్నంగా ఆమె నిలుస్తారని రషన్లు నమ్ముతున్నారు.