ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ
వాయువ్య ఉత్తరప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్ ,మధ్య ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో *ద్రోణి* కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో
*రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం* ఉందన్నారు. గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
*మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతో పాటు ఎండ ప్రభావం* చూపే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. *రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, పశ్చిమగోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40- 41°C వరకు ఉష్ణోగ్రతలు* రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.
*రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు.*
*జూన్ 11, బుధవారం
• ప్రకాశం, పోట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందన్నారు.
*జూన్ 12, గురువారం
• నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
• అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
*జూన్ 13, శుక్రవారం
• తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సాలూరులో 43మిమీ, శ్రీకాకుళంలో 42.7మిమీ, విశాఖ జిల్లా ఆనందపురంలో 37.5మిమీ వర్షపాతం రికార్డైందన్నారు.
ఇవాళ ప్రకాశం జిల్లా వేమవరంలో 40°C, కొనకనమిట్లలో 39.9°C, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9°C, కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8°C ఉష్ణోగ్రతలు నమోదైంది.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT