Greetings for the love of the Muslim brothers
I went on the invitation of Kavivaryulu Devapalana to receive Gurram Joshua award in Addaki. Before the meeting that evening, I went to the local mosque for Maghrib Namaz. After the namaz, when I was about to get up to go, Maulali Garochchi Bhai said to me, sit down. I don’t know why. I sat like that.
The poet Karimullah was in our mosque. That announcement that let’s have a small spiritual meeting in the verandah. Meeting outside the mosque in the verandah, honoring me, explaining my literary work – this is how the love of Muslims poured out on me. The love shown in every step of them was important. In this felicitation program held under the patronage of Syed Moulali, President of Shadi Khana, I was really surprised by their observational vision when they were describing my literary journey for Muslim social consciousness and secular values with religious harmony for three decades. Thank you for the love of Muslims.
Kavi Karimullah, Vinukonda, 25.3.2023
అద్దంకి ముస్లిం సోదరుల ప్రేమకు సలాములు
అద్దంకిలో గుర్రం జాషువా పురస్కారం అందుకునేందుకు కవివర్యులు దేవపాలన గారి ఆహ్వానం మేరకు వెళ్ళాను.ఆ సాయంత్రం జరగబోయే సభకు ముందు స్థానిక మస్జిద్ కు మగ్రిబ్ నమాజ్ వెళ్లాను.నమాజ్ ముగిసాక వెళ్దామని పైకి లేవబోతుంటే ఆ సమయంలో మౌలాలి గారొచ్చి భాయ్ మీతో పనుంది కొద్దిగా కూర్చోండి అన్నారు.ఎందుకన్నారో తెలియదు.అలా కూర్చుండిపోయాను.ఇంతలో మైకులో ఓ ప్రకటన.కరీముల్లా కవి మన మస్జిద్లోనే ఉన్నారు.వరండాలో చిన్న ఆత్మీయ సమావేశం జరుపుకుందాం అని ఆ ప్రకటన.మసీదు బయట వరండాలో సమావేశం జరగటం ,నన్ను సత్కరించటం,నా సాహిత్య కృషిని వివరించటం – అద్దంకి ముస్లింల ప్రేమాభిమానాలు నాపై ఇలా వెల్లివిరిసాయి.ఇక్కడ సత్కారం చేశారనో, శాలువాలు, మెమెంటోలు ముఖ్యం కాదు.నా సాహిత్యం పట్ల వారిలో అడుగడుగునా కన్పించిన ప్రేమ ముఖ్యమనిపించింది.షాదీఖానా ప్రెసిడెంట్ సయ్యద్ మౌలాలి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ముస్లిం సామాజిక చైతన్యం కోసం, మతసామరస్యంతో కూడిన లౌకిక విలువల కోసం సాగిన నా సాహిత్య ప్రయాణం గురించి వారు వివరిస్తుంటే వారి పరిశీలనా దృష్టికి నాకు నిజంగా ఆశ్చర్యమేసింది.అద్దంకి ముస్లింల ప్రేమకు ధన్యవాదాలు.25.3.2023…
-కవి కరీముల్లా, వినుకొండ