వేసవిలోప్రజలు తగు జాగ్రత్తలుతీసుకోవాలి…
బాపట్ల పట్టణం,మరియు బాపట్ల మండలంలో ఎండలు నిప్పుల కొలిమిలా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బయట తిరగకూడదని, అత్యవసర పరిస్తితులలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని మహమ్మదాపురం ఆరోగ్య కేంద్ర వైద్యులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి మజ్జిగ, కొబ్బరినీళ్లు,మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యాధికారి చూచించారుఎండల తీవ్రత అధికంగా ఉన్నందువలన వృద్ధులు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు మరియు రైతులు జాగ్రత్తలు పాటించాలనీ ఈ సందర్భంగా తెలియజేశారు.
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ముందుగా తీసుకునే జాగ్రత్తలు
1. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల లోపు బయటికి రాకుండా ఉండాలి. ఈ లోగో ఏమైనా పనులు ఉంటే ముందుగా చూసుకోవాలి .
2 .ప్రతి వ్యక్తి ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల మంచినీరు తాగాలి.
3. బయటికెళ్లేటప్పుడు గొడుగు,కానీ క్లాత్ ని వాడాలి. 4. బట్టలు పల్చటి బట్టలు వాడాలి డార్క్ కలర్ బట్టలు వాడకూడదు. లైట్ కలర్ బట్టలు ధరించాలి.
5. ప్రతిరోజు టెంకాయ నీళ్లు మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
వడ దెబ్బలక్షణాలు
1. తల తిరిగినట్లు ఉండడం కన్ను గుడ్డు లోపల నుంచి నొప్పి ఉండడం
2. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండడం
3.వాంతులు, విరేచనాలు
4. కళ్ళు తిరగడం మైకం రావడం చెమటలు ఎక్కువగా పట్టడం
వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. వడదెబ్బకు గురి అయిన వ్యక్తిని చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లడం
2. తడిగుడ్డుతో శరీరం అంతా పొడవాలి.
3. నీరుగాని ఓఆర్ఎస్ గాని ఉప్పు చక్కెర మిశ్రమం కానీ తాగించాలి ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించాలి.
4.ప్రతి గ్రామ పంచాయతీలొ ఆశా వర్కర్ ,ANM, MLH దగ్గర ORS ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి.