No media or officials will be allowed into the Assembly and Council galleries tomorrow.
* Media holding letters of authority issued by Election Commission of India are allowed up to the designated area in the Assembly premises.
* Live coverage of Assembly and Council meetings as usual from 4th Block Publicity Cell.
Returning Officer Subbareddy.
Amaravati, 22 March:
MLC Election Returning Officer and Legislative Council Joint Secretary PV Subbareddy has informed that in view of MLA Quota MLC Elections being held in the Assembly Building on Thursday 23rd of this month from 9 am to 4 pm, the media will not be allowed to enter the media galleries of the Assembly and Council. He informed that there is no permission.
Therefore, all media friends are advised not to come to the assembly building for coverage of tomorrow’s assembly and council meetings.
As usual, live coverage of Assembly and Council meetings will be done from the 4th Block Publicity Cell.
For coverage of MLC elections, media representatives with authority letters (passes) issued by the Election Commission of India will be allowed up to the designated area in the Assembly premises.
అసెంబ్లీ,కౌన్సిల్ గ్యాలరీల్లోకి మీడియా, అధికారులు ఎవరికీ అనుమతి లేదు -23-03-2023
* భారత ఎన్నికల సంఘం జారీ చేసిన అథారిటీ లెటర్స్ ఉన్న మీడియాకు అసెంబ్లీ ప్రాంగణంలోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతి.
* 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి యధావిధిగా అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాల లైవ్ కవరేజ్.
రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి.
అమరావతి,22 మార్చి:
ఈనెల 23 వతేదిన గురువారం ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకు అసెంబ్లీ భవనంలో ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అసెంబ్లీ, కౌన్సిల్ మీడియా గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి లేదని ఎంఎల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి సంయుక్త కార్యదర్శి పివి సుబ్బారెడ్డి తెలియ జేశారు.అలాగే అధికారుల గ్యాలరీల్లోకి కూడా అధికారులు ఎవరికీ అనుమతి లేదని ఆయన తెలియజేశారు.
కావున ఈవిషయాన్ని మీడియా మిత్రులు అందరూ గమనించి రేపటి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల కవరేజ్ నిమిత్తం అసెంబ్లీ భవనంకు వద్దకు రావద్దని తెలియజేయడ మైనది.
యదావిధిగా 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాల లైవ్ కవరేజ్ చేయబడుతుంది.
ఎంఎల్సి ఎన్నికల కవరేజ్ నిమిత్తం మీడియా ప్రతినిధులకు భారత ఎన్నికల సంఘం వారు జారీ చేసిన అథారిటీ లెటర్స్(పాస్ లు)కలిగిన మీడియా ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణం లోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతించడం జరుగుతుంది.