నిర్మల ఫార్మసీ కళాశాల విద్యార్థులకు జాతీయ సేవా పథక ఉత్తమ వాలంటీర్ల పురస్కారాలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథక విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్తమ జాతీయ సేవా పథక అధికారులుకు మరియు వాలంటీర్లకు పురస్కారాలు అందజేయబడుతాయి. 2023-2024 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కార ప్రదానోత్సవం మార్చి 27న నిర్వహించబడింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 194 జాతీయ సేవా పథక (NSS) యూనిట్లు ఉండగా, సుమారు 19,400 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ పురస్కారాల కోసం అర్హులైన వారిలో ఎంపికైన ఆరుగురు వాలంటీర్లకు ప్రతి సంవత్సరం ఈ గౌరవం లభిస్తుంది. ఈ పురస్కారం విద్యార్థుల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత ఆసక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథక ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు తెలిపారు.
ఈ ఏడాది ఎంపికైన ఆరుగురు వాలంటీర్లలో, ముగ్గురు విద్యార్థులు నిర్మల ఫార్మసీ కళాశాలకు చెందినవారై ఉండటం విశేషం. ఈ పురస్కారాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధర్ రావు, రెక్టర్ ప్రొఫెసర్ కె. రత్నశీలమణి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి. దివ్య తేజోమూర్తి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ప్రమీలరాణి గారిచే అందజేయబడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. పాముల రెడ్డి తెలిపారు.
ఈ పురస్కారాన్ని అందుకున్న విద్యార్థులు:
బొర్రా దివ్యశ్రీ (బి.ఫార్మసీ, నాలుగో సంవత్సరం)
రితేష్ చంద్ర (బి.ఫార్మసీ, నాలుగో సంవత్సరం)
ఎస్. రేవంత్ సాయి (ఫార్మా డీ, నాలుగో సంవత్సరం)
విద్యార్థుల నిరంతర కృషి, సామాజిక సేవలోని ఉత్సాహాన్ని గుర్తించినందుకు గాను, వీరికి 2024 ఆగస్టులో న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ సేవా పథకం తరపున అతిథులుగా హాజరయ్యే అవకాశం లభించిందని కళాశాల కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి. నిర్మల జ్యోతి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరే కృష్ణరాయ్, డాక్టర్ స్వప్న, డాక్టర్ ఆషా బేగం, డాక్టర్ సుధీర్, డాక్టర్ ఆలీ, డాక్టర్ సౌజన్య, డాక్టర్ స్పందన, డాక్టర్ లక్ష్మయ్య తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, బీఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఫార్మా డి విద్యార్థులు పాల్గొని, పురస్కార విజేతలకు అభినందనలు తెలియజేశారు.
Dr. రేఖా నరేష్ బాబు
ప్రోగ్రాం ఆఫీసర్,
జాతీయ సేవా పథకం,
నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.