నెక్ట్స్ లోకేష్ ?
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో సీఐడి తదుపరి గురి లోకేష్ మీదా ఉన్నట్లు అర్ధమవుతోంది. స్కిల్ సెంటర్ కుంభకోణంతో పాటు ఇతర కుంభకోణాల్లో లోకేష్ పాత్రపైన లోతుగా దర్యాప్తు జరుగుతోందని సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల్లో కూడా లోకేష్ పాత్రుందని సీఐడీ అనుమానిస్తోంది. దీంతో లోకేష్ పై అవసరమైన ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ మూడు శాఖలకు మంత్రిగా పని చేశారు. పైగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ ను లోకేష్ బినామీగా సీఐడీ పదేపదే ప్రస్తావించింది. జరిగిన కుంభకోణంలో లోకేష్ పాత్రపై ఇప్పటికే అధారాలు దొరికినా ఇవి సరిపోవని మరికొన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.
ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు లోకేష్ పాత్రపైన సరైన ఆధారాలు దొరికాయని సంజయ్ చెప్పారు. అదేసమయంలో మాజీమంత్రి, టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పైన కూడా ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు ఏ1 , అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కొడుకును సీఐడీ అరెస్టుచేసింది. సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వానికి ఒప్పందం జరిగినపుడు హైయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంటుతో నే ఒప్పందం జరిగింది. ఆసమయంలో గంటానే ఉన్నత విద్యాశాఖ మంత్రి.