అనవిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ తండ్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి వారి కళా క్షేత్రంలో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అనవిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ స్వాగతోపన్యాసం చేస్తూ మా తండ్రి మండలి వెంకట కృష్ణారావు ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని గడిపారన్నారు. ఆయన శాసనసభ్యునిగా అసెంబ్లీకి బస్సులో వెళ్లేవారన్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిని సైతం పేద వారికి పంచిన వ్యక్తిత్వం ఆయనకే సొంతమన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులు ఈనాటి కాలంలో కనిపించరన్నారు. సమాజం కోసం, సమైక్యత కోసం ఆయన అనునిత్యం తాపత్రపడ్డారన్నారు. మండలి వెంకట కృష్ణారావు అడుగు జాడల్లోనే నా జీవితాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తానన్నారు. మా తండ్రి చివరి కోరికైన పులిగడ్డ – పెనుమూడి వారధి నిర్మాణాని అనుమతులు ఇచ్చిన గొప్పవ్యక్తిత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు జాతి రత్నం .. దివిసీమ గాంధీగా పేరొందిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆయన గత స్మృతులను గుర్తుకు తెచ్చాయన్నారు. నిబద్ధత కలిగిన జీవితం ఆయనకే సొంతం అన్నారు. పార్లమెంటు సభ్యునిగా, శాసనసభ్యునిగా, మంత్రి గా పనిచేసి తనదైన ముద్ర వేశారన్నారు. పద్మ శ్రీ వచ్చిన ప్రముఖులను పట్టించుకున్న వారు గత ప్రభుత్వంలో లేవన్నారు. దివిసీమ ఉప్పెనలో వేల మంది చనిపోయారని అప్పుడు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు.
గరికిపాటి నరసింహారావు మాట్లాడుతూ గాంధేయ వాదానికి జరుగుతున్న శత జయంతి కార్యక్రమమన్నారు. కృష్ణారావు పై కవిత్వం తో పొగడ్త లు కురిపించిన గరికపాటి.. ఆయన ఆశయాలను ఆచరించడమే నిజమైన ఆరాధన అని అన్నారు. 175 మంది శాసనసభ్యులు కూడా మండలి వెంకట కృష్ణారావు లా నిరాడంబరంగా తయారు కావాలన్నారు.
విశ్వయోగి విశ్వంజీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచం అస్తవ్యస్థంగా ఉందని, పంచభూతాలు ప్రపంచ తాండవం చేస్తున్న సమయం ఇది అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రపంచంలో నంబర్ వన్ గా చేస్తారని ఆయనకు ఆ సమర్ధత ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ను పొగడుతూ పాట పాడారు… నాధ్యేయం.. నా గమ్యం మరువను.. మరువను ఎన్నటికీ.. మరచి నడువను ఎన్నటికీ … నేనే వేసే ప్రతి అడుగు మీ వైపే నీ వైపే.. అని పాట పాడారు
మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, యార్లగడ్డ వెంకటరావు, నాయకులు బూరగడ్డ వేద వ్యాస్, సామినేని ఉదయభాను తదితరలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సంచిక ఆవిష్కరణ చేశారు.. కృష్ణా రావు చిత్ర పటాన్ని ఆవిష్కరణ చేశారు.. దివిసీమ పునర్ నిర్మాత.. ఆదర్శనేత..అజాత శత్రువు పుస్తకం ఆవిష్కరించారు. పద్మశ్రీ లు అన్నవరపు రామస్వామి , గరికపాటి నరసింహారావు, దండమూడి సుమతి, యడ్లపల్లి వెంకటేశ్వరరావు లను శాలువా, మెమెంటో తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు.