Hon’ble Governor of Telangana Felicitates Graduates at the 3rd Convocation Ceremony of SRM University-AP
Amaravati: “Education provides you confidence. Sharpen your skills each passing day and visualise the development of your nation. Learn more than expected and earn more than expected is the ideology that we live by today”, Her Excellency Dr Tamilisai Soundararajan, Hon’ble Governor of Telangana, the chief guest of the 3rd Convocation Ceremony of SRM University-AP remarked while addressing the graduating Class of 2023.
The university has conferred the prestigious degrees to the Graduate Class of 2023 at the 3rd Convocation Ceremony on September 02, 2023, in the august presence of Guest of Honour, Prof. Ashutosh Sharma, President-Indian National Science Academy; Dr T R Paarivendhar, Founder Chancellor, SRM Group of Institutions; Dr P Sathyanarayanan, Pro-Chancellor, SRM University-AP; Prof. Manoj K Arora, Vice Chancellor, SRM University-AP; Other dignitaries; Deans of all schools, faculty, staff and parents of the graduating batch. A remarkable 883 graduates, including 13 PhD scholars, 17 Gold medallists, 6 Silver medallists and 2 Bronze medallists were awarded their degrees at the momentous ceremony held at the APJ Abdul Kalam Auditorium.
“In our objective of being globally connected, nationally relevant and regionally transformative university, we have adopted a five-year strategic plan with five goals – Achieve academic excellence, Intensify research, innovation and entrepreneurial spirit, Enhance student experience, Attain financial sustainability and Improve perception and visibility”, stated Vice Chancellor, Prof. Manoj K Arora in his welcome address and briefing about the annual report on the progress of the institution in the past academic year.
Founder Chancellor, Dr T R Paarivendhar,in his address to the young graduates,commented that India’s first solar launch, Aditya L1 and our country’s presidency over the G20 summit coincided with the students’ graduation and encouraged them to strive for excellence with love for family, their alma mater and country in their hearts. “Success in life needs to be balanced with philosophy and spirituality. SRM University-AP has preparedyou for the transition of student to alumni, by imparting knowledge and the skill to learning how to learn. Use the skills you have acquired to pursue prosperity and contribute to the growth of society”, advised Pro-Chancellor, Dr P Sathyanarayanan on this milestone event.
The university also conferred an Honorary Doctorate to Prof. Ashutosh Sharma, esteemed Guest of Honourby the Founder Chancellor, Dr T R Paarivendharand Hon’ble Governor for his exemplary contributions to the field of sciences.“Success and inclusive development is going to be a global challenge. As we continue to progress at an unprecedented pace, remember that new knowledge is no knowledge without using it for socio-economic good” stated Prof. Sharma in his address. He deeply appreciated how research is ingrained into the very fabric ofthe varsity’s educational approach assuring research opportunities to the young researchers of our country.
The convocation ceremony successfully concluded with the administration of the pledge by the graduation cohort, honouring the national anthem and the departure of the dignitaries.
విద్యార్థులు తమ శక్తిసామర్థ్యాలకు పదును పెట్టాలి
– నిత్యం కొత్త ప్రక్రియలను నేర్చుకోవాలి.
– ,,ఎస్ఆర్ఎం విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ తమిళసై సూచన
– ఘనంగా స్నాతకోత్సవం, 883 మంది విద్యార్థులకు డిగ్రీలు
అమరావతి, సెప్టెంబరు 2:
విద్యార్థులు తమలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలకు నిత్యం పదును పెడుతూ ఉండాలనీ, అప్పుడే అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో నెలకొన్న పోటీతత్వాన్ని సమర్థంగా ఎదుర్కోగలరని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రతి రోజూ కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలని సూచించారు. శనివారం జరిగిన ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవానికి డాక్టర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవ వేదికపై పట్టభద్రులైన విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలనుద్దేశించి. ప్రసంగించారు. భావి భారతావనికి క్రమ శిక్షణ గల విద్యార్థులను అందిస్తోన్న అధ్యాపకులకు తాను మొట్టమొదటి నమస్కారాన్ని తెలియజేస్తున్నానన్నారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని చూశాక తాను ఏపీలో ఉన్నానా… లేక ఫారిన్ కంట్రీలో ఉన్నానా అన్న సందేహానికి గురయ్యానన్నారు. యూనివర్సిటీ భవనాలను చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైననట్లు పేర్కొన్నారు. తాను తెలంగాణలో 14 యూనివర్సిటీలకు చాన్సలర్ ననీ, ఎక్కడా ఈ తరహా అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియంను చూడలేదన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాలు ప్రధానమని పేర్కొంటూ, వర్సిటీ యాజమాన్యాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అవకాశాలను సృష్టించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కరోనా వ్యాప్తి సమయంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వ్యాక్సినేషన్ టెస్ట్ డ్రైవ్ కు ఎంతో సహకారం అందించిందనీ, ఈ సందర్భంగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నానన్నారు.
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులు కొత్త లక్ష్యాలతో, ఆశయాలతో ముందుకు సాగాలన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. వర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొ ఛాన్సలర్ డాక్టర్ సత్యనారాయణన్ ఇకపై ఛాన్సలర్ గా కొనసాగుతారని పేర్కొన్నారు. విద్యార్థులు జనరల్ నాలెడ్జిని కూడా
పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఉజ్వల జీవన విధానానికి, దేశ ప్రగతికి దోహదపడే కలలను సాకారం చేసుకోవాలని డాక్టర్ సత్యనారాయణన్ పేర్కొన్నారు.
అనంతరం శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషమైన సేవలు అందించిన డాక్టర్ అశుతోష్ శర్మకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ముఖ్య అతిథి, గౌరవ అధిథులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవం ప్రారంభం సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్కుమార్ ఆరోరా స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథి ప్రసంగం ముగిశాక 883 మంది విద్యార్థులకు డిగ్రీలు, బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. గవర్నర్ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ అరిఫ్ లు యూనివర్సిటీకి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రేమకుమార్, డీన్లు డాక్టర్ వినాయక్, డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ విష్ణుపథ్, డాక్టర్ రంజిత్ థాపా తదితరులు పాల్గొన్నారు.