రాజధాని పారిశుధ్య కార్మికులపై వేధింపులు ఆపాలి
అనంతవరంలో విధులు మానేసి శుక్రవారం నాడు పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికులు
అకారణంగా పనికి రావద్దని ఆపిన అనంతవరం పారిశుధ్య కార్మికుడు శేషయ్యను వెంటనే పనిలోకి తీసుకోవాలి
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా తీవ్రమైన ఎండల్లో నిడమర్రు పొలాల్లో,
రాజధాని గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులను, అసెంబ్లీ, సచివాలయాల్లో పనిచేసే హౌస్ కీపింగ్ కార్మికులను తీసుకువెళ్లి పని చేపిస్తుండటంతో అనారోగ్యాల పాలై ఆసుపత్రులకు వెళుతున్న కార్మికులు
శుక్రవారం నాడు కార్మికులకు అధికారులు తెప్పించిన భోజనాల్లో పురుగులు
ఉపాధి హామీ ద్వారా రాజధాని లోని కూలీలకు పని కల్పించాలి
*రాజధాని గ్రామాల నుండి నిడమర్రు పొలాలకు తరలించి పని చేపిస్తున్న పారిశుధ్య కార్మికులు అస్వస్థతకు గురి కాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి కోరారు
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తుళ్లూరులో ప్రకటన విడుదల చేశారు
ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రాజధానిలో కూలీలకు పని కల్పించాలని కోరారు
అనంతవరం, నెక్కల్లు గ్రామాలలో సూపర్వైజర్ గా పని చేస్తున్న మన్మధరావు వేధింపులకు నిరసనగా,
పని నుండి ఆపివేసిన కార్మికు డు శేషయ్యను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ
రెండు గ్రామాల కార్మికులు విధులు మానేసి గత సోమవారం నుండి నిరసన లు తెలుపుతున్న
ఇప్పటివరకు సూపర్వైజర్ మన్మధరావు పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు
ఇటువంటి దుందుడుకు వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే కార్మికుల్లో అధికారుల పట్ల గౌరవం సన్నగిల్లుతుందని అన్నారు
శేషయ్య ను పనికిరావద్దని సూపర్వైజర్ మన్మధరావు ఆపేసి ఇప్పటికి పది రోజులు గడుస్తున్నా
శేషయ్యను పనిలోకి తీసుకోవాలని కోరుతూ అనంతవరం కార్మికులందరూ పని మానేసిన అధికారులు స్పందించడం లేదని రవి అన్నారు
పారిశుద్ధ్య కార్మికుడు, నిరుపేదైన శేషయ్యను వెంటనే పనిలోకి తీసుకోవాలని రవికోరారు