Date :03-06-2023
అమరావతి:
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ది. 3 జూన్ 2022 (శనివారం ) నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా శ్రీ రాజ్ కుమార్ బోనం (వైస్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్, బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ) హాజరయ్యారు.
ముఖ్య అతిదిగా శ్రీ రాజ్ కుమార్ బోనం (బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్) విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. తదుపరి మహాత్మాగాంధీ అకాడెమిక్ బ్లాక్ లోని మేకర్స్ స్పేస్ మరియు ఇంజనీరింగ్ క్లీనిక్ లను ప్రారంభించారు .
ఈ సందర్భంగా ముఖ్య అతిధి శ్రీ రాజ్ కుమార్ బోనం (వైస్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్, బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ) మాట్లాడుతూ బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలకు వీఐటీ-ఏపీతో సుదీర్ఘ అనుబంధం ఉందని, ఈ అనుబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. 2017లో ప్రారంభించినప్పటి నుండి వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయం తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయన అభినందించారు. ఆటోమోటివ్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలియచేసారు. విఐటి-ఎపి విశ్వవిద్యాలయం విద్యకు సంబంధించిన విశిష్టమైన కాన్సెప్ట్‌ను డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ ని అభినందిస్తూ, విద్యార్థులు ఈ కాన్సెప్ట్ ద్వారా రెగ్యులర్ స్ట్రీమ్ కాకుండా ఏదైనా ఒక స్పెషలైజేషన్‌ని ఎంచుకోవడానికి వీలు కలుగుతుందని, పూర్తి ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ (FFCS®), ద్వారా విద్యార్థులు వారి స్వంత సెమిస్టర్ ప్లాన్‌ను చేసుకొని కోర్సులను ఎంపిక చేసుకోవడానికి దోహదపడుతుందని తెలియచేసారు.
విఐటి వ్యవస్థాపకుడు మరియు ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ మాట్లాడుతూ విఐటి నాలుగు క్యాంపస్ లలో దాదాపు 80 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, అత్యుత్తమ విద్య విధానాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందింస్తున్నామని, విద్యార్థులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమని తెలియచేసారు.
ఈ సందర్భంగా 171 అకాడెమిక్ అవార్డులు, 12 ఎండోమెంట్ అవార్డులు, 142 అధ్యాపక అవార్డులు, 24 సిబ్బంది అవార్డులు, 110 రీసెర్చ్ స్కాలర్స్ అవార్డులు సాధించిన విద్యార్ధులు, అధ్యాపకలు మరియు సిబ్బందిని ప్రశంసించారు. అంతే కాకుండా 5 సంవత్సరాల సర్వీస్ ను పూర్తిచేసిన 32 మంది అధ్యాపకులు, 17 సిబ్బందిని సత్కరించారు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా||. ఎస్.వి. కోటా రెడ్డి విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను చదివి విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి , డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) డా|| అనుపమ నంబూరు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.