Amaravati: On 31.03.2023 in the afternoon, at about two o’clock in the afternoon, a press release was issued for the incident which took place near the Dharna Point of the three capitals/Bahujan Parirakshan Samiti Dharna Point.
In connection with the incidents of stone pelting on the convoy carrying BJP National Secretary Sathya Kumar, which insulted the Chief Minister of Andhra Pradesh, both factions ie Y.S.R.C.P. A scuffle took place between party workers and BJP party workers. Complaints given by both sides were registered as two separate cases in Tullur Police Station and investigation was carried out. On the night of 31.03.2023, the person who threw stones at the convoy belonging to the BJP party was identified and identified as Dunna Nithin@George, aged 23 years, Thalaipalem village, Tullur mandal, on the night of 31.03.2023.
According to the guidelines of the Hon’ble Supreme Court in the above case, the said accused was charged under Section 41(A) Cr.P.C. Notice has been given. In the case of insulting the Chief Minister of Andhra Pradesh, the Hon’ble Supreme Court will also deal with the guidelines. If the person again behaves as above, legal action will be taken and the Hon’ble Court will bring them before them.
In the backdrop of the controversial remarks made by the former Minister of Jammalamadugu C. Adinarayana Reddy on the Chief Minister of Andhra Pradesh, YSRCP. The party workers got agitated and planned to hold a protest and the police responded in time and managed to prevent the agitation. No one knows that BJP National Secretary Sathya Kumar was in the said car, even Sathya Kumar did not get down from the car.
The stone pelter did not attack Satyakumar, but stone pelted the convoy on the Seed Axis Road with the intention of protesting. The stone pelter was identified through technical evidence, detained and interrogated.
K. Arif Offiz, IPS., Superintendent of Police, Guntur District, Mr. Anil Kumar, Additional Superintendent of Police, Guntur (L & O) and Mr. V. Pothuraju, Sub-Divisional Police Officer, Tullur participated in this press conference.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని ధూషించిన , బి.జే.పి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఉన్న కాన్వాయ్ పై రాయివిసరడం సంఘటనలకు…
ది.31.03.2023 మద్యాహ్నం సుమారు రెండు గంటల సమయములో, మూడు రాజధానుల ధర్నా పాయింట్/భహుజన పరిరక్షణ సమితి ధర్నా పాయింట్ సమీపములో, జరిగిన సంఘటనకు పత్రికా ప్రకటన విడుదల చేయడమైనది.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని ధూషించిన , బి.జే.పి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఉన్న కాన్వాయ్ పై రాయివిసరడం సంఘటనలకు సంబందించి, ఇరు వర్గాలు అనగా వై.యస్.ఆర్.సి.పి. పార్టీ కార్యకర్తలు – బి.జే.పి పార్టీ కార్యకర్తలు మధ్య తోపులాట జరిగినది. ఇరువర్గాలు ఇచ్చిన పిర్యాదులను, రెండు వేరు వేరు కేసులు గా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో రిజిస్టరు చేసి ధర్యాప్తు చేపట్టడం జరిగింది.
బి.జే.పి పార్టీ కి చెందిన కాన్వాయ్ పై రాయి విసిరిన వ్యక్తిని గుర్తించి, సదరు దున్నా నితిన్ @ జార్జ్, వయస్సు 23 సంవత్సరములు తాళ్ళాయిపాలెం గ్రామము, తుళ్ళూరు మండలం అను వ్యక్తిని ది.31.03.2023 రాత్రి అదుపులోకి తీసుకుని, అరెస్టు చేయడం జరిగింది.
పై కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ మేరకు, సదరు ముద్దాయికి 41(A) సి.ఆర్.పి.సి. నోటీసు ఇవ్వడం జరిగింది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని ధూషించిన కేసులో కూడా గౌరవ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు వ్యవహరించడం జరుగుతుంది. సదరు వ్యక్తి తిరిగి పై విదముగా వ్యవహరించినట్లయితే, చట్ట ప్రకారము చర్య తీసుకుని, గౌరవ కోర్టు వారి ఎదుట హాజరు పరచడం జరుగుతుంది.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి C. ఆదినారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాక్యలు చేసిన నేపద్యములో వై.యస్.ఆర్.సి.పి. పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురై నిరసన తెలియచేయాలనే అనుకున్న కార్యక్రమమును పోలీసు వారు సకాలములో స్పందించి, ఆందోళన కార్యక్రమమును నివారించగలిగారు. సదరు కారులో బి.జే.పి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఉన్న విషయము ఎవరికీ తెలీయదు, సత్యకుమార్ కూడా కారులోనుండి క్రిందకు దిగలేదు.
రాయి విసిరిన వ్యక్తి సత్యకుమార్ పై దాడి చేయాలనే ఉద్ధేశముతో కాకుండా, నిరసన తెలియచేయాలనే ఉద్ధేశముతో సీడ్ యాక్సిస్ రోడ్లో వెళ్ళుచున్న కాన్వాయ్ పై రాయివిసరడం జరిగింది. సదరు రాయి విసిరిన వ్యక్తిని సాంకేతిక ఆధారముల ద్వారా గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది.
ఈ పత్రికా ప్రకటన సమావేశములో K. ఆరిఫ్ ఆఫీజ్, IPS., సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు జిల్లా, శ్రీ అనిల్ కుమార్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు (L & O) మరియు శ్రీ V. పోతురాజు, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్, తుళ్ళూరు పాల్గొన్నారు.