అమరావతి
జీవితాలను పణంగా పెడుతూ, రాత్రనకా, పగలనకా సముద్రం పైన కాలం గడిపే మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచుతూ.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వం..
నెల్లూరు జిల్లా బోగోలు మండలం లో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం మరియు
ONGC పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఐదో విడతగా రూ. 161.86 కోట్ల పరిహారం చెల్లింపు..
25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు ప్రారంభించడంతో పాటు, ONGC పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డా|| బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు మన ప్రభుత్వమే చొరవ తీసుకుని ONGC ద్వారా ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ. 11,500 చొప్పున 6 నెలలకుగాను రూ.69,000, మొత్తంగా రూ. 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు (12.03.2024) సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
ఇప్పుడు అందిస్తున్న రూ.161.86 కోట్ల సాయంతో కలిపి జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు మన ప్రభుత్వం చొరవతో ఇప్పటివరకు ఐదు విడతల్లో అందించిన ఓఎన్జీసీ పరిహారం మొత్తం రూ. 647.44 కోట్లు
మత్స్య రంగానికి వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలో మన ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 4,913 కోట్లు ..
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రత్యేకతలు..
25వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనున్న ఫిషింగ్ హార్బర్..
1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు అవకాశం.. ఏడాదికి 41,250 టన్నుల మేర సముద్ర మత్స్య ఉత్పత్తి చేసే అవకాశం..
కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్లు, చిల్ రూమ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన, బోట్ రిపేర్ వర్క్ షాపులు, గేర్ షెడ్ లు, నెట్ మెండింగ్ షెడ్ల ద్వారా మత్స్యకారులకు మరింత లబ్ధి..
సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి, వలసలను అరికట్టే లక్ష్యంతో రూ. 3,793 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మన ప్రభుత్వం.. నేడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్టర్ ప్రారంభం.. చురుగ్గా ఇతర ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్టర్ల నిర్మాణ పనులు..
మత్య్స ఎగుమతులకు మరింత ఊతమిస్తూ ఈ 58 నెలల్లోనే సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం.. శరవేగంగా నిర్మాణ పనులు.. పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు..