“తల్లికి వందనం” పథకం ద్వారా కుటుంబంలోని ప్రతి అర్హ విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయం
రాజమహేంద్రవరం,
తేదీ:17.6.2026
రాజమహేంద్రవరంలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మంత్రులు నిమ్మల రామానాయుడు,
మంత్రి కందుల దుర్గేష్
“తల్లికి వందనం” పథకం ద్వారా కుటుంబంలోని ప్రతి అర్హ విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే విద్యా ప్రోత్సాహక పథకాల పరిధిని ప్రస్తుత ప్రభుత్వం విస్తరించిందని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
సామాజిక సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం డీపీఆర్ తయారీకి రూ.14 కోట్లు కేటాయించి లైడార్ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.
డీపీఆర్ పూర్తైన వెంటనే గోదావరి డెల్టా ప్రక్షాళన పనులు ప్రారంభిస్తామని తెలిపారు.











































