విశాఖ సేవా సదన్ స్కూల్ 10 వ తరగతలో అద్భుతమైన ఫలితాలు
విశాఖపట్నం: రాంనగర్ లో ఉన్న V.s.sవిద్యార్ధులు 10 వ తరగతి ఫలితాలు లో 500 పై బడి మార్కులు సాధించారని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తంగి పార్వతి తెలిపారు. స్కూల్ యాజమాన్యం,ఉపాద్యాయులు , తల్లిదండ్రులు ఈ ఫలితాలు పట్ల ఆనందాన్ని వ్యక్త పరిచారు. 510 మార్కులతో స్వాతి, 505 మార్కులతో గౌరీ విశాలి ఉత్తీర్ణత సాధించారు.
ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్దులు కూడా 450 పైబడి మార్కులు సాధించడం వారి తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని కలిగించింది. విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు ను కల్పించడం వలన విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారని స్కూల్ కార్యదర్శి & కరస్పాండెంట్ తెలిపారు.ఉపాధ్యాయులు ప్రత్యేక కాలమాన పట్టికను సంవత్సరం పాటు ప్రణాళిక బద్ధంగా అమలు పరచడం వలన ఇంత మంచి ఉత్తీర్ణత సాధించగలిగారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.
విద్యార్థులందరికీ కంప్యూటర్ ను ఉపయోగించి పునఃశ్చరణ తరగతులు నిర్వహించడం వలన వెనుకబడిన విద్యార్థులు కూడా మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.
పిల్లలకు చదువుతోపాటు యోగా, దృశ్య రూపక విద్యా బోధన , అన్ని రకాల ఆటలు మరియు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వలన వారి మానసిక విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయని ఆమె అన్నారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించుట కొరకు ప్రతి నెల ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరాలలో ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లను తీసుకొని రావడం వల్ల సలహాల ఆధారంగా రక్త పరీక్షలు, బరువు, హి మోగ్లోబిన్ శాతం పెంచుకొనుటకు కావలసిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
తంగి పార్వతి , హెడ్ మిస్ట్రెస్ ,విశాఖ సేవా సదన్ స్కూల్