ఈద్గా స్థలం కొరకు ఎదురు చూస్తున్న రాయపూడి ముస్లిమ్స్
అమరావతి:
నిన్న(26-05-2023) జరిగిన వైస్సార్సీపీ కార్యక్రమంలో లో “రాయపూడి కి చెందిన మిత్రులు ఈద్గా స్థలం కావాల్సిఉన్నదన్న అభ్యర్ధన కాపీ ను” సీఎం కు ఇచ్చే ప్రయత్నం చేయగా డిపార్ట్మెంట్ మేడం తీసుకుని గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి కు అందచేసినారు. ఈద్గా స్థలం అభ్యర్ధన గురించి డిప్యూటీ కలెక్టర్ అరా తీయగా, అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందిన “రాజధాని వార్తలు” ఎడిటర్ హుస్సేన్ ఖాన్, కొన్ని వివరాలను డిప్యూటీ కలెక్టర్ కు వివరిస్తున్న సందర్భమిది. త్వరలో ప్రభుత్వం దీని గురించి రాయపూడి ముస్లిం పెద్దలను పిలుస్తామని డిప్యూటీ కలెక్టర్ హామీ ఇచ్చారు .
ఇదే అభ్యర్ధనను గతంలో కత్తెర సురేష్ కుమార్ కు రాయపూడి మత పెద్దలు ఇచ్చినప్పుడు అయన సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి తొందరగానే ఈద్గా స్థలాన్ని ఇప్పిస్తామని హామి ఇచ్చి ఉన్నారు.
దాదాపు 10 సంవత్సారాల నుంచి ముస్లిమ్స్ ఆశిస్తున్న ఈద్గా స్థలం
తొందరగా ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నా.
– హుస్సేన్ ఖాన్