చదువే స్థితిగతులను మార్చగలిగేది – ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో మొదట గెలిచిన విద్యార్థులకు అభినందన
ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఆర్కే పారితోషకం అందజేత…
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి టౌన్, రూరల్ లో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇళ్లకు ఈరోజు ఉదయం 8.00 గంటల నుండి ఎమ్మెల్యే ఆర్కే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థులను వారి తల్లిదండ్రులను కలిసి అభినందించి ఒక్కొక్క విద్యార్థికి 10,000/- రూపాయల పారితోషాకాన్ని ఆ విద్యార్థులకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు.
మంగళగిరి పట్టణం నందు రత్నాల చెరువులో zphs నందు చదువుతున్న గోలి విజయ దుర్గ అనే విద్యార్థి (579)కి, మంగళగిరి రూరల్ పెదవడ్లపూడి జడ్పీహెచ్ఎస్ నందు గుర్రం రమ్య (577) కి, తాడేపల్లి జడ్.పి.హెచ్.ఎస్ నందు రామ తులసి (509) కి, కొలనుకొండ కు చెందిన ఉదయ నాగలక్ష్మి (588) ల ఇళ్ళకు వెళ్లి వారిని అభినందించి, ఒక్కొక్కరికి 10 వేలు పారితోషకాన్ని అందజేశారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో విద్యార్థులందరూ బాగా చదువుతున్నారని, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలను పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలను నిలబెడుతూ ఈరోజు విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారని అన్నారు.