A maniacal government is running at the centre
Indian democracy is in jeopardy
KVP Ramachandra Rao, former member of the Rajya Sabha at the meet the press program
Vijayawada, April 1: Former Rajya Sabha member KVP Ramachandra Rao has said that the country’s democracy is in danger under BJP rule. He participated in the Meet the Press program organized at the Vijayawada Press Club on Saturday and gave an emotional speech. They say we are facing a government with a maniacal mentality. He said that while our country’s debts are increasing by lakhs of crores, Adani’s assets are increasing hugely. They asked if questioning Adani is considered as treason and if questioning a big corrupt person is treason. It is alleged that the share is going to Prime Minister Narendra Modi from Adani. Senior leaders of the Congress said that the maniacal government is running at the Center and thus the Indian democracy is in danger. The Center is only looking to protect the investors and also the corrupt. He said that since Adani and Modi are inseparable twins, Adani’s wealth is increasing manifold. He said that if India is reduced in debt, its income will increase four times. He alleged that Modi will get share through Adani who is embezzling. It is regrettable that Rahul, who is ready to question the corruption they are doing in the country, is harassed.
He said that Modi government is always working on corruption. Asking Adani about this corruption, they are calling it treason. Questioning Modi’s alleged corruption, MP Rahul Gandhi said it is not reasonable to accuse him of treason. He expressed his concern that they are trying to trouble Rahul just by looking for Kuntisak. Moreover, he described it as an undemocratic act to remove the text of the speech of the leader of the opposition MP Rahul Gandhi from the Parliament speech. He said that the person who should disqualify a member of Parliament is the President, but it has never happened that Rahul was disqualified without doing so and it should never happen again. He said that this is the first time that Rahul was disqualified without receiving a copy of the court’s verdict, which has never happened in history. Descendants of Motilal, who sacrificed their own property for the country, said Nehru’s family, Rahul Gandhi, does not even own a house in Delhi. He said that if the house allotted to the member of parliament is ordered to be vacated, it is an undemocratic act.
It is a shame that there is no response from AP
KVP said that it is a shame that there is no response from AP if the senior members of Parliament disqualify Rahul, who has been an MP for the past twenty years. He said that they do not understand why the AP leaders are so angry even though there is such a terrible attack on democracy. He alleged that YCP has some problems and that is why they are not able to question BJP. He described the loss of Rahul Gandhi as an attack on democracy. He said that now the country is in danger and it is the responsibility of everyone to protect it. He said that a fascist government is running at the centre. He said that all the state governments except AP are questioning the anarchy of the central government.
Where is the questioning Pawan?
Jana Sena chief Pawan Kalyan, who said that he had come only to ask questions, said that it was a noteworthy development that he did not speak due to his close relations with the party. Pawan, the questioner on AP politics, also questioned why he is not talking about the undemocratic policies taking place at the Center today. If there is an attack on democracy in the case of Rahul, why is Pawan not speaking? He said that if he does not question now, there will be no opportunity to talk about anything in the future.
Chandrababu is silent
Chandrababu, who headed the NDA saying that he turned the wheels at the centre, today questioned why Chandrababu is not talking about the injustice done to Rahul Gandhi. Babu, who talks about all the issues happening in AP, why is he not talking about Rahul Gandhi? If Chandrababu has respect for laws, he should stand against central actions. He said that Chandrababu is ignoring his responsibility in this matter. If democracy is in trouble then why Chandrababu is not coming forward to talk. At this time when democracy is collapsing, Chandrababu needs to go to Delhi and fight and he argued that Babu is the only one who deserves it. He admitted that it is true that he opposed TDP contesting with Congress. However, he said that he is ready to work with the TDP if the center asks about the injustice done to Rajiv Gandhi today. Vijayawada Press Club President Nimmaraju Chalapathy Rao presided over the Meet the Press program and IJU Steering Committee members Ambati Anjaneulu, APUWJ State General Secretary Chandu Janarthan, Vice Presidents K Jayaraj, Vijayawada Urban President, Secretaries Chava Ravi, Konda Rajeswara Rao, Press Club Secretary R Vasanth and others were present in the program. .
Will you tell me soon why you are staying away from Jagan: KVP
Senior Congress leader and former MP KVP Ramachandra Rao is known to be a soul mate of late Chief Minister YS Rajasekhara Reddy. KVP, which is closest to YS, stays away from AP Chief Minister Jagan, whom he considers his son-in-law
Source: Chalapathi Rao, Joutnalist
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
కేంద్రంలో ఉన్మాద ప్రభుత్వం నడుస్తోంది
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు
విజయవాడ, ఏప్రిల్1: బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఉన్మాద మనస్తత్వం కలిగిన ఒక ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొంటున్నామని చెప్పారు. మన దేశ అప్పులు లక్షల కోట్లు పెరుగుతుంటే అదానీ ఆస్తులు మాత్రం భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారని, ఒక పెద్ద అవినీతిపరుడిని ప్రశ్నిస్తే దేశ ద్రోహం అవుతుందా అని అడిగారు. అదానీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి వాటా వెళ్తోందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్మాద ప్రభుత్వం నడుస్తోందని తద్వారా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్రంలో కేవలం పెట్టుబడిదారులు రక్షించేందుకు చూస్తున్నారని, అలానే అవినీతిపరుదుని రక్షించేందుకు చూస్తున్నారన్నారు. అదాని, మోడి అవిభక్త కవలలు కావడంతో ఆదాని సంపద ఎన్నో రెట్లు పెరుగుతోందన్నారు. భారతదేశం మాత్రం అప్పుల్లో కురుకుపోతుంటే అదానీ ఆదాయం మాత్రం నాలుగింతలు పెరుగుతుందన్నారు. అక్రమార్జన చేస్తున్న అదానీ ద్వారా మోడీకి వాటా అందుతుందని ఆయన ఆరోపించారు. దేశంలో వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడానికి సిద్దమైన రాహుల్ ని వేధింపులకు గురిచేయడం శోచనీయమన్నారు.
మోడీ ప్రభుత్వం నిత్యం అవినీతిపై పనిచేస్తోంద న్నారు. ఇదేమిటని అవినీతిపై అదానీని ప్రశ్నిస్టే దేశద్రోహం కింది పెడుతున్నారన్నారు. మోడీ అదాని చేసే అవినీతిని ప్రశ్నించిన ఎంపీ రాహుల్ గాంధీ పైన దేశద్రోహం నింద మోపడం సమంజసం కాదన్నారు. కేవలం కుంటిసాకు వెతికి రాహుల్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ పాఠాన్ని పార్లమెంటు స్పీచ్ నుంచి తొలగించడం అప్రజాస్వామికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పార్లమెంటు సభ్యుడిని అనర్హునిగా ప్రకటించాల్సిన వ్యక్తి రాష్ట్రపతి కాగా అలా జరగకుండానే రాహుల్ ని అనర్హునిగా ప్రకటించడం ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదని ఇక ఎప్పుడు కూడా ఇలా జరగకూడదని అన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే కాపీ కూడా అందకుండా రాహుల్ పై అనర్హత వేటు వేయడం వంటి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారని,చరిత్రలో ఎపుడు జరగలేద న్నారు. దేశం కోసం వారి సొంత ఆస్తులను త్యాగం చేసిన మోతీలాల్ వారసులు నెహ్రూ కుటుంబమైన రాహుల్ గాంధీకి ఢిల్లీలో సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు కి కేటాయించిన ఇల్లు కూడా ఖాళీ చేయాలని ఆదేశించడం చూస్తుంటే ఇది ఎంత అప్రజాస్వామికమైన చర్యో అవగతం అవుతుందన్నారు.
ఏపీ నుంచి స్పందనలేకపోవడం సిగ్గుచేటు
గత ఇరవై ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న సీనియర్ పార్లమెంటు సభ్యులు రాహుల్ పై అనర్హత వేటు వేస్తే ఏ పి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటని కేవీపీ అన్నారు. ప్రజాస్వామ్యం పై ఇంత దారుణంగా దాడి జరుగుతున్నా ఏ.పి.నేతలు ఎందుకు మోనంగా ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. అందుకు వైసీపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అందువల్లే వారు బీజేపీని ప్రశ్నించలేకపోతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి జరిగే నష్టం ప్రజాస్వామ్య పై జరిగే దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం దేశం ప్రమాదంలో ఉందని దాన్ని రక్షించు కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేంద్రంలో ఫాసిస్ట్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అరాచకాలను ఏపీ మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు.
ప్రశ్నించే పవన్ ఎక్కడ
కేవలం ప్రశ్నించడానికే వచ్చానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఆపార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా మాట్లాడకపోవడం గమనించదగ్గ పరిణామమే అన్నారు. ఏపీ రాజకీయాలపై ప్రశ్నించే వ్యక్తి పవన్ కూడా నేడు కేంద్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాహుల్ విషయంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇక ఇపుడు ఆయన ప్రశ్నించకపోతే భవిష్యత్ లో ఏమి మాట్లాడే అవకాశం ఉండదన్నారు.
చంద్రబాబు మౌనమేల
కేంద్రంలో చక్రాలు తిప్పాను అని చెబుతూ ఎన్డీఏకి సారధ్యం వహించిన చంద్రబాబు నేడు రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయం పై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని దెప్పిపొడిచారు. ఏపీలో జరిగే అన్ని అంశాలపై మాట్లాడే బాబు రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబుకు చట్టాలపై గౌరవం ఉంటే కేంద్ర చర్యలపై నిలదీయాలన్నారు. ఈ విషయంలో చంద్రబాబు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటానికి ముందుకు రావడం లేదన్నారు. ప్రజాస్వామ్యం పడకేస్తున్న ఈ సమయంలోచంద్రబాబు ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అందుకు బాబు మాత్రమే అర్హుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో టీడీపీ కలిసి పోటీచేయడాని తాను వ్యతిరేకించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే నేడు రాజీవ్ గాంధీకి జరిగిన అన్యాయం విషయంలో ఇప్పుడు కేంద్రం ప్రశ్నిస్తే టీడీపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఉపాధ్యక్షులు కె జయరాజ్, విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్ వసంత్ తదితరులు ఉన్నారు.
జగన్ కు ఎందుకు దూరంగా ఉంటున్నానో త్వరలోనే చెబుతా : కేవీపీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మ బంధువుగా పేరుగాంచిన వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కేవీపీ తన అల్లుడిగా భావించే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ వైఎస్ కు దగ్గరగా ఉన్న తాను జగన్ కు దూరంగా ఎందుకు ఉంటున్నాననే విషయం గురించి త్వరలోనే చెపుతానని అన్నారు. ఇప్పుడే దీనిపై మాట్లాడనని, కానీ ఎప్పటికైనా ఈ విషయం గురించి మాట్లాడాల్సిందేనని, మరో రోజు మీడియా ముఖంగా అన్ని విషయాలను వివరిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Source: Chalapathi Rao, Joutnalist