హమాస్ దుందుడుకు దాడి – పాలస్తీనా ప్రజలకు కడగండ్లు
- కనీస సౌకర్యాలు కరవు
అగ్రదేశాల ఆజ్యం - Attack by Hamas mob on oct 7th-2023
Now Torture to Palestinian people
Basic amenities are scarce in Gaza
To this Palastine – Israel Issue Top countries are siding and fueling to the fire
అంతంతమాత్రంగా జీవిస్తున్న పాలస్తీనా ప్రజలను నిప్పుల కొలిమిలోకి తోసింది హమాస్ చేసిన పనికిమాలిన పని. అక్టోబర్ 7న పాలస్తీన మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చెయ్యడంతో పాలస్తీనా ప్రజలు బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తున్నారు.
పాలస్తీనీయులు నివసిస్తున్న అతికొద్ది భూ భాగమైన గాజాలోని హమాస్ తీవ్రవాదులను ఏరిపారేస్తామని ఇజ్రాయిల్ భీకర దాడులు జరుపుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ దాడుల్లో గాయపడి దివ్యాంగులుగా మారిన పాలస్తీనా ప్రజలు అక్కడినుంచి ఎక్కడికి వెళ్లాల్లో తెలియక వేధన అనుభవిస్తున్నారు. శత్రుదేశం ఏం చేస్తుందనే అంచనాలేకుండా హమాస్ దుందుడుకు దాడి చేయడం అమాయక పౌరుల ప్రాణాలమీదకు తెచ్చింది. దీంతో మధ్య ఆసియా నిప్పుల కుంపటిపై జీవించాల్సి వస్తోంది. ఈ రెండు పక్షాల మధ్య ఘర్షణలు మరొకసారి తారస్థాయికి చేరాయి. ఇది మూడవ ప్రపంచ యుద్దంగా మారుతుందేమో అని మిగతా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
పంచ దేశాల కళ్లన్నీ నిన్నటి వరకు రష్యా – ఉక్రెయిన్ మీద ఉంటే, ప్రస్తుతం పాలస్తీన – ఇజ్రాయిల్ పైనే ఉన్నాయి. అత్యంత దారుణంగా ఉన్న నేటి పరిస్థితులను రెండు దేశాలు ఎలా అధిగమిస్తాయన్నది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఒట్టోమెన్ సామ్రాజ్యంలో (పూర్వ టర్కీ పాలనలో) పాలస్తీనా శాంతియుతంగానే ఉండేది. మొదటి ప్రపంచ యుద్దంలో టర్కీ ఓడిపోవడంతో పాలస్తీన బ్రిటీష్ సామ్రాజ్య వాదుల చేతుల్లోకి వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పాలస్తీనా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి జారినట్లయ్యింది. అందుకు కారణం యూదులు.
పాలస్తీనా యూదులు, ముస్లింలు, క్రీస్టియన్లు, ఆర్మోనియులకు పుట్టినిల్లు. అనేక యుద్దాలు, ఘర్షణలతో యూదులు పాలస్తీనాను వదిలి ప్రపంచంలోని అనేక దేశాల్లో తలదాచుకున్నారు. అయితే అక్కడ వారు అనేక పాట్లు పడ్డారు. బానిసలుగా బ్రతికారు. జర్మనీ నియంత హిట్లర్ చేతిలో వారిపై జరిగిన దాష్టికాలు, దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. మొదటి ప్రపంచ యుద్దం తర్వాత జాతుల సమస్యతో యూదులకు ఒక దేశం కావాల్సి వచ్చింది. ఇదే సమయంలో అరబ్బుదేశాల సమాఖ్యకు తెలియకుండా బ్రిటీన్ సైక్స్ పీకోట్ ఒప్పందం చేసుకుంది. దీంతో పాలస్తీనాలో ఇజ్రాయిల్ దేశానికి అంకురార్పణ జరిగింది. అప్పటికే కొంతమంది యూదులు పాలస్తీనాకు తిరిగి వచ్చి అక్కడ భూములు కొన్నారు. యూదులు డామినేట్ గా ఉండటంతో వారిని తట్టుకునేందుక పాలస్తీనా జాతీయ సంఘం ఏర్పడింది. రెండు జాతుల మధ్య సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది.
ఐక్యరాజ్య సమితి 1945లో పాలస్తీనాలో ఇజ్రాయిల్ ఏర్పాటును సమర్థించింది. వాస్తవానికి ఇజ్రాయిల్ దేశం కాదు. యాకోబును యె(హో) వా దేవుడు ఆశీర్వదించి పెట్టిన పేరు గా బైబిల్, ఖుర్ ఆన్ లు చెబుతున్నాయి. పాలస్తీనాలోని 55 శాతం భూమిని యూదులకు 45 శాతం భూమిని పాలస్తీనా ప్రజలకు బ్రిటన్ పంచింది. నిజానికి పాలస్తీనా జనాభా ఎక్కువ . దీంతో ’వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‘ పేరుతో అరబ్బు దేశాలు ఇజ్రాయిల్ పై దాడి చేశాయి. అయితే ఈ యుద్దంలో అవి ఓడిపోయాయి. ఇందుకు కారణం ఇజ్రాయిల్ కు అమెరికా సహాయం చేయడమే. గాజా – వెస్ట్ బ్యాంకు నుంచి ఇజ్రాయిల్ ముస్లింలను తరిమివేసింది. మరికొంతమందిని బంధించింది. ఇంకొందరు జోర్డాన్, సిరియాకు వలసలు వెళ్లారు. మరో 15 లక్షల మంది పాలస్తీనాలోని వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనాపై అప్రకటిత యుద్దం చేస్తోంది.
ఓపెన్ జైలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ జైలు పాలస్తీనాలో ఉంది. అక్కడి పాలస్తీనా ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లే అవకాశం లేదు. వారి ఇంట్లో మహా అయితే వారి వీధిలో మాత్రమే ఉండాలి. మిగతా వీధుల్లో ఇజ్రాయిల్ కు సంబంధించిన సెటిలర్ల ఇళ్లు ఉండటంతో ఆయా వీధుల్లో తిరిగి సౌకర్యం పాలస్తీనా ప్రజలకు లేదు. దీంతో అనేక మంది ఒకే ఊరిలో ఉన్న తమ తల్లిదండ్రులు, బంధుమిత్రులను కలిసే వీలు లేకుండా పోయింది.
ఇజ్రాయిల్ పై అమెరికా ప్రేమ ఇజ్రాయిల్ పై అమెరికా అతి ప్రేమను కురిపించడానికి కారణం యూదులు 3 శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ అమెరికాలో 24 శాతం సంపదను అందించడమే. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే ఇజ్రాయిల్ ను 51 వ రాష్ట్రంగా అమెరిక ప్రేమిస్తోందని లెఫ్టిస్టులు మండిపడుతున్నారు. చమురు నిల్వలు అధికంగా ఉన్న గల్ఫ్ లోని 13 దేశాలపై పెత్తనం సాగించడానికి అమెరికాకు అక్కడ ఆశ్రయం ఇచ్చే దేశం ఉండాలి. అందుకే అమెరికా ఇజ్రాయిల్ కు ప్రతి ఏడాది 300 కోట్ల డాలర్లను ఆర్థిక సాయంగా అందిస్తుంది. అలాగే అనేక కాంట్రాక్టులను కూడా కట్టబెడుతుంది. అమెరికా తన సాంకేతికలను అందించడం ద్వారా ఇజ్రాయిల్ వ్యవసాయం, పరిశ్రమలు, సైనికరంగాల్లో శరవేగంగా అభివద్ది చెందుతోంది.
ఇక పాలస్తీనా విషయానికి వస్తే అక్కడ కరెంటు లేదు. దీంతో పరిశ్రమలు లేవు. ప్రాజెక్టులూ లేవు. కుటీరపరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఉన్ రావ (యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన) సంస్థకు మన దేశంలో పాటు, ప్రపంచ దేశాలు సహాయం చేస్తాయి. దీంతో ఐదున్నర లక్షల మంది పాలస్తీనా పిల్లలకు చదువు, పౌరులకు వైద్యసాయం అందుతుంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఏటా ఇచ్చే 270 మిలియన్ డాలర్ల సహాయాన్ని పాలస్తీనాకు నిలిపివేసింది. దీంతో అమెరికా మానవ హక్కుల ఉల్లంఘన జరుపుతోందని మిగతా దేశాలు ఆక్రోషిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి 1947లో చేసిన నిబంధన మేరకు జెరుసలేం లేదా బెత్లెహేం లకు స్వయంప్రతిపత్తి నగరాలుగా గుర్తించగా, ఆ నిబంధనను అతిక్రమిస్తూ ట్రంప్ హయాంలో ఇజ్రయిల్ రాజధాని టెల్ అవీవ్ ను కాకుండా జెరుసలేం కు మార్చి తన రాయబార కార్యాలయాన్ని అక్కడికి మార్చింది అమెరిక. ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలన్ని గర్హించాయి. ఒక్క లాటిన్ అమెరికా దేశాలు మాత్రమే అమెరికాకు మద్దతు పలికాయి.
భారత్ గుర్తింపు
1990 వరకు దౌత్యపరంగా ఇజ్రాయిల్ ను భారత్ గుర్తించలేదు. వాజ్ పాయ్, పీవీ నర్సింగరావు లు ప్రధానిగా ఉండగా మాత్రమే సంబంధాలు ఏర్పరచుకున్నారు. 1993లో మా రెండు దేశాలను గుర్తించాలన్న ఇజ్రాయిల్ ప్రపంచ దేశాలతో చేసుకున్న ఓస్లో ఒప్పందం ప్రకారం ఆదేశంలో భారత్ దౌత్య సంబంధాలను ప్రారంభించింది. అయితే ఓస్లో ఒప్పందాన్ని ఇజ్రాయిల్ ఎన్నడూ అమలు చేయలేదు.
ఆధునిక చరిత్రలో పాలస్తీనా నుంచే శరణార్థుల సమస్య ఉత్పన్నం అయ్యింది. ఇప్పటివరకు రిజిస్టర్ చేయించుకున్న 60 లక్షల మంది పాలస్తీనా కాందిశీకులు ఉండగా, అంతకంటే ఎక్కువమంది రిజిస్టర్ కాని వారున్నారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయిల్ – అమెరికా ఘాతుకాలకు 2 కోట్ల జనాభా ఉన్న సిరియాలో కోటిమంది శరణార్థులుగా మారారు.
ఆజ్యం పోస్తున్న అగ్రదేశాలు
హమాస్ దాడులు జరపడం అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ పాలస్తీనాపై విరుచుకుపడి గాజాను నేలమట్టం చేస్తోంది. ఇది చాలదన్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యుద్ద ప్రాతిపదికన ఇజ్రాయిల్ రావడం దానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం, ఆతర్వాతి రోజు బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునాక్ ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహును కలసి తన తోడ్పాటును అందిస్తామని చెప్పడం వారి యుద్దకాంక్షను, అగ్నికి ఆజ్యం పోసే వ్యవహారాన్ని తెలియచేస్తోంది. మనం కాస్త వెనక్కి వెళ్లి చూసుకుంటే ఉక్రెయిన్- రష్యా యుద్దంలో కూడా వారిద్దరూ ఇలాగే వ్యవహరించి 76 గంటల్లో ముగించాల్సిన యుద్దాన్ని ఏళ్లపాటు కొనసాగించి ఇరు వర్గాలకు అపార నష్టాన్ని కలిగించారు. అందమైన ఉక్రెయిన్ ను శ్మశానంగా మార్చిన విషయం తెలిసిందే.
దీనిని గమనించి పాలస్తీన – ఇజ్రాయిల్ ల ప్రజాప్రతినిధులు రెచ్చిపోకుండా సమస్యను సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.