Amaravati: In the context of AP Global Investors Summit 2023 to be held in Visakhapatnam on March 3 and 4, the AP Government has published special books on AP Tourism, Handicrafts, Temples, Beaches, Soul’s Space, A Two Z Table Guide.
Books in English, German, Spanish, Chinese languages, books explaining the specialties of AP in airport lounges, embassies of different countries, tourism centers, special articles in these books on tourism and investment friendly climate in AP
The Tourism Department of AP Government, which won the Best Tourism Policy Award, brought to the notice of the Chief Minister that other states are also studying the AP Tourism Policy. Congratulating the Chief Minister, the Chief Minister said that necessary steps should be taken to make it a tourism destination hub in the coming days. The Chief Minister should lead the state, which is number one in ease of doing business, on the path of development in all fields and make it a haven for investments.
Special CS of Tourism Department Dr. Rajat Bhargava, Special CS of Industries Department R. Karikal Valaven and Commissioner of Information Department Tumma Vijaykumar Reddy participated in this program.
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్
మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపధ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించిన ఏపీ ప్రభుత్వం
ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ బాషల్లో పుస్తకాలు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూ పుస్తకాలు, ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు
బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ఆ శాఖ అధికారులు. అభినందించిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల్ వలవెన్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి.