ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంటర్ అర్హతతో మీడియా కోర్సులు.
దర్శకత్వం,సినిమాటోగ్రఫీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసిన ఎ.ఎన్.యు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది జర్నలిజం&మాస్ కమ్యూనికేషన్ విభాగంలో సరికొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది.సమాజంలో రోజు రోజుకు మీడియా రంగంలో వినూత్న కోర్సులు అవి ర్భవిస్తున్న తరుణంలో ఆచార్య నాగార్జున యూని వర్సిటీ కూడా మీడియా కోర్సులను ప్రవేశపెట్టింది. 20ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎంఏ జర్నలిజం కోర్సు దినదినాభివృద్ధి చెంది నూరుశాతం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగి ఉంది.ఈక్రమంలో మీడి యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించి నూతన కోర్సుల ను,పార్ట్ టర్మ్ కోర్సులను వర్సిటీప్రారంభించింది.డిప్లమో, సర్టిఫికెట్ విధానం లో కోర్సులను తీసుకు వచ్చిం ది.ఇంటర్మీడియేట్ అర్హత తో ఈ ప్రవేశాలు కల్పించ నున్నారు.
కోర్సుల వివరాలు
డిప్లమో ఇన్ ఫిల్మ్ మేకింగ్,డిప్లమో ఇన్ ఫోటో గ్రఫీ,డిప్లమో ఇన్ ఫిల్మ్ డైరెక్టర్, డిప్లమో ఇన్ : యాక్టింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ రైటింగ్,సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సినిమాటోగ్రఫీ, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ షార్ట్ ఫిల్మ్ ప్రొడ క్షన్,డాక్యు మెంటరీ,సర్టి ఫికెట్ కోర్స్ ఇన్ ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సులను ప్రారంభించింది. డిప్లమో కోర్సులు ఏడాది కాలంలో, సర్టిఫికెట్ కోర్సులు 6నెలల కాలంతో నిర్వహిస్తారు. ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ డైరెక్టర్, యాక్టింగ్ కోర్సులకు రూ.30వేలు, స్టోరీ అండ్ స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటో గ్రఫీ,షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్, డాక్యుమెంటరీ కోర్సులకు రూ.20వేలు, ఫోటోగ్రఫీ, ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సులకు రూ. 10 వేలు చొప్పున ఫీజులను నిర్ణ యించారు.వీటితో పాటు దరఖాస్తుకు, ప్రాసెసింగ్ కి వెయ్యి చొప్పున, మెడికల్ ఫండ్ కింద రూ. 240 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను జూన్ 14వ తేదీలోగా సమర్పించాలి. రూ.500 ఫైన్ అదే నెల 24వ తేదీ వరకు సమర్పిం చుకునే అవకాశం కల్పించి నట్లు. అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జి.అనిత పేర్కొ న్నారు.