27 న అంతర్జాతీయ ఎమ్ఎస్ఎమ్ఇ దినోత్సవ వేడుకలు
అమరావతి, జూన్ 24: అంతర్జాతీయ ఎమ్ఎస్ఎమ్ఇ దినోత్సవ వేడుకలను విజయవాడలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్కులో ఈ నెల 27 న నిర్వహించడం జరుగుచున్నది. ఏపీ ఎమ్ఎస్ఎమ్ఇ డవలెప్మెంట్ కార్పొరేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోషియేషన్ సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు రాష్ట్ర ఎమ్ఎస్ఎమ్ఇ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎమ్పవర్మెంట్ & రిలేషన్సు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు సభ్యుల నమోదు కార్యక్రమంతో ప్రారంభమై మధ్యాహ్నం 12.40 గంటలకు ముగింపు రిమార్కులతో ఈ కార్యక్రమం ముగియనున్నది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్.ఏ.పి.ఎస్.ఐ.ఏ. ప్రెసిడెంట్ వి.మురళీ కృష్ణ స్వాగతోపన్యాసం, ఏపీ ఎమ్ఎస్ఎమ్ఇడిసి సి.ఇ.ఓ. ఆదర్శ రాజీన్ధ్రన్ RAMP పథకంపై ప్రసంగిస్తారు. రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎన్.యువరాజ్ ప్రసంగం తదుపరి రాష్ట్ర ఎమ్ఎస్ఎమ్ఇ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎమ్పవర్మెంట్ & రిలేషన్సు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యక్రమం ప్రారంభోత్సవ ప్రసంగం చేస్తారు. అనంతరం ఎం.ఓ.యు.ల మార్పిడి, మంజూరు లేఖలు / చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడబడుతుంది. తదుపరి “ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నెముఖను శక్తివంతం చేయడం : వృద్ధికి ఉత్ప్రేరకాలుగా ఎమ్ఎస్ఎమ్ఇ లు” (Empowering the Backbone of the Economy: MSMEs as Catalysts for Growth) అనే అంశంపై ప్రముఖుల ప్యానెల్ డిస్కషన్లు ఉంటాయి.