ఖుర్బానీ ఇచ్చిన జంతువుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టకండి
ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రముఖ ముస్లిం సంస్థ జామియత్ ఉలేమా-ఈ-హింద్ కొన్ని నియమ నిబంధనలను జారీ చేసింది. ఖుర్బానీ (బలి) ఇచ్చిన జంతువుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టొద్దని ముస్లింలకు సూచించింది.
న్యూఢిల్లీ, జూన్ 13: ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రముఖ ముస్లిం సంస్థ జామియత్ ఉలేమా-ఈ-హింద్ కొన్ని నియమ నిబంధనలను జారీ చేసింది. ఖుర్బానీ (బలి) ఇచ్చిన జంతువుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టొద్దని ముస్లింలకు సూచించింది. ఖురాన్‌లో నిషేధించిన జంతువులను ఖుర్బానీ ఇవ్వకూడదని స్పష్టంచేసింది. దేశంలో సున్నిత పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని మతాల, కులాల వారు పవిత్రంగా భావించే జంతువులను ఖుర్బానీ ఇవ్వకూడదని పేర్కొంది. ఖుర్బానీ ఇచ్చాక జంతువుల అవశేషాలను ఎంపిక చేసిన ప్రాం తాల్లో పూడ్చి పెట్టాలని, వాటిని రహదారుల వెంట, బహిరంగ ప్రదేశాల్లో పడేయరాదని పేర్కొంది. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని విన్నవించింది.