Girls, Sex and Philosophy–stunning facts about Pune
అమ్మాయిలు సెక్స్ ఫిలాసఫీ-పూణే గురించి వాస్తవాలు
2 విమానాలు 4 బస్సులు, 3 కార్లు, డజను ఆటోలు 7 రోజుల బస మొత్తం ఖర్చు రూ.30,000. టూరిస్ట్‌గా కాకుండా రచయితగా మరియు సాంస్కృతిక పరిశీలకుడిగా నా వారం రోజుల బసలో పూణే ని కొత్త కోణంలో చూసాను.
విమాన్ నగర్ పూణేలో “తూర్పు నెక్లెస్” తళుకు బెళుకులకు ప్రసిద్ధి ఐతే , కొరేగావ్ పార్క్ పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. కొరేగావ్ పార్క్ నిజంగా పార్క కాదు. పెద్ద చెట్లతో పూర్తిగా కప్పబడిన ఒక ఒక సంపన్న ప్రాంతం . దట్టమైన చెట్ల సూర్యరశ్మి నేలని తాకని ప్రదేశం. మనం అడవి లో తిరుగుతున్న అనుభూతిని ఇస్తుంది . ప్రఖ్యాత ఓషో ఆశ్రమం ఇక్కడ ఉంది. హింజేవాడి అగ్రశ్రేణి ఐటీ రంగస్థలం అగాఖాన్ ప్యాలెస్: గాంధీ మరియు నెహ్రూల విలాసవంతమైన జైళ్లను శనివార్ కోట 18వ శతాబ్దంలో భారత రాజకీయాలకు కేంద్రం . శనివార్ కోటలో మరాఠా సామ్రాజ్య ప్రధాన మంత్రి పీష్వా బాజీ రావు వన్ గుర్రపుస్వారీ విగ్రహం చూసేసి ఇంటికి వెళ్ళిపోతే ఒక టూరిస్టుగానే మిగిలిపోతాము.
టూరిస్ట్ సమాచారం ప్రతి పట్టణం గురుంచి కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. ప్రదేశాలు వాటి ప్రాముఖ్యత చెప్పాలంటే అనేక వెబ్సైట్లు ఉన్నాయి. ప్రదేశాలు , తిండి బాగుంటే కోరుకున్న అన్ని విలాసాలు లభిస్తే ఆ వూరు బాగుంటుందని అనుకుంటాం. అవి బాగున్నా మనుషులు వాళ్ళ ఆలోచనా దృక్పథం, సంస్కృతి బాగోకపోతే ప్రజలలో వ్యాపార ధోరణి ఎక్కువైపోతే అశాంతి తో అలమటిస్తాం. బొంబాయి ని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బొంబాయి ఉరకలు పరుగుల జీవన విధానానికి రద్దీ రహదారులకు పూర్తి విరుద్ధం పూణే.
ప్రతి మూలలో పూణేలో కొత్త ఉత్సాహం ఉంది. ప్రతి మలుపులోనూ ప్రశాంతత ప్రజలలో నెమ్మది , సంస్కృతిలో సహజత్వం రహదారులలో చల్లదనం నిశ్శబ్దత చూస్తాము. విజయవాడలో ఉన్న చెట్లతో పోలిస్తే పూణేలో 100 రెట్లు ఎక్కువ చెట్లున్నాయి. రోడ్లకిరువైపులా ఎక్కడ పెడితే అక్కడ పెద్ద చెట్లు విస్తరించి ఉంటాయి. విశాలమైన ఉద్యానవనాల తో పూణే పెద్ద పార్కులో ఉన్న నగరంలా కనిపిస్తుంది. రహదారులు పై రద్దీ తక్కువగా ఉండి రోడ్లు ఖాళీగా కనిపిస్తాయి.
ఒకప్పుడు బెంగళూరు ఉద్యానవనం. ఇప్పుడు అది ఉద్యాన నగరం కాదు. ఈరోజు పూణే ఉద్యాన నగరం. పూణే విజయవాడ కంటే ఐదు రెట్లు పెద్దది. విజయవాడ విస్తీర్ణం 61 కిలోమీటర్లు. పూణే విస్తీర్ణం 331 కిలోమీటర్లు. రోడ్లు మరియు బస్సులు చాలా అరుదుగా రద్దీగా ఉంటాయి. రోడ్డుమీద చల్లటి చెట్ల నీడలో నడవాలిపిస్తుంది. పూణేలో రాజకీయ నాయకుల ఫ్లెక్స్ బేనర్లు కనిపించవు . మైకులు వినిపించవు. పూణేలో వారం రోజుల బసలో నేను చూసినవి నాలుగు బేనర్లు మాత్రమే అవి కూడా సామాజిక లేదా భక్తి కార్యక్రమం, లేదా ప్రారంభోత్సవ ఆహ్వానం కోసం పెట్టినవే విజయవాడలో రాజకీయ నాయకుల ఫ్లెక్స్‌లు ప్రతి 10 అడుగులకు దర్శనమిస్తాయి. రోడ్డు డివైడర్ల మీద జంక్షన్ లలోట్రాఫిక్ సైన్ బోర్డులు కనిపించకుండా బేనర్లు కక్కుర్తిగా పెట్టే సంస్కృతి ఇక్కడ తాండవిస్తోంది చెట్ల కొమ్మలపై కాకులు కూడా వాలడానికి చోటులేకుండా ఫ్లెక్స్ బేనర్లు కట్టేస్తారు. రాత్రి పగలు ఇసుక లారీలు తిప్పుతూ అక్రమ సంపాదన కోసం అర్రులు చాచే రాజకీయనాయకులు రోడ్లు ఛిద్రమైపోయినా పట్టించుకోని ప్రభుత్వాలు అడుగడుక్కీ చర్చిలు అర్ధరాత్రి దాకా మైకులు. ఇది విజయవాడ పరిస్థితి.
ఇంక విజయవాడలోని ప్రజల విషయానికొస్తే రాష్ట్రంలోని రాజకీయ నాయకుల కంటే ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా దీనంగా కనిపిస్తాయి . ఒక కులంలో పుట్టడమే చాలా గొప్ప అన్నట్టు కార్లు మరియు బైక్‌లపై కులం పేరు రాసుకుంటారు. నేబర్ ప్లేట్ ల స్థానంలో సినీ నటుడి స్టిక్కర్లు కనిపిస్తాయి. వీళ్ళ మనస్తత్వాన్ని చూస్తే వికారంగా ఉంటుంది. పూణేలో వందలాది కార్లు, బైక్‌లను చూశాను ఆటల్లో ప్రయాణించాను . ఏ ఆటోకి సినీ హీరోల పోస్టర్లు లేవు. కులం ట్యాగ్‌లు అసలే లేవు. పూణేలో ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు మనకు కనిపిస్తారు. సరదాగా పలకరిస్తారు.
ప్రఖ్యాతి గాంచిన పూణే ఫిలాసఫికల్ సొసైటీ కి వెళ్లి అక్కడ తత్వవేత్త డా. టెండూల్కర్ గారిని కలిసి ముచ్చటించడం ఎంతో ఆసక్తి కలుగజేసింది . ఆతరువాత వయసులో ఉన్న ఆడపిల్లలను, స్త్రీలను కలిసి వారితో మాట్లాడుతుంటే డా. టెండూల్కర్ గారితో మాట్లాడుతున్నట్టే అనిపించింది. అందచందాల ప్రదర్శన చేయకుండా ఉండడం సౌమ్య వ్యక్తిత్వం, మర్యాద ప్రవర్తన చాలా హాయిగా అనిపించింది. విమాన్ నగర్‌లో నేను కలిసిన అమ్మాయిల లో చాలా విశాల దృక్పథం కనిపించింది. వారు 50ఏళ్ల ఆడవాళ్లలా నాతో మాట్లాడారు.
జపనీస్ ఒకాయమా పార్కులో టీనేజీ అమ్మాయిలు నిస్సంకోచంగా మాతో ఫొటోలు దిగారు.
ఆడపిల్లలు ఏమాత్రం వెనుకాడకుండా స్నేహభావం తో మెలిగేరు. కోక్వెటిష్ ఎగ్జిబిషనిజం లేని స్నేహశీలత పూణేలోని అమ్మాయిలలో కనిపిస్తుంది. పూణే చూసి వస్తే మనకి మంచి సంస్కృతి ప్రశాంతత అవసరం అనిపిస్తుంది.