27-09-2023
విదేశీ విద్యాదీవెనతో 1830 మందికి సాయం అందించిన జగనన్న ప్రభుత్వం
–అంకంరెడ్డి నారాయణమూర్తి
గత ప్రభుత్వం విదేశీ విద్యకు వార్షిక ఆదాయం రూ 6 లక్షలకు పరిమితం చేసి, రూ 10 లక్షల నుంచి రూ 15 లక్షలు మాత్రమే సాయమందించేదని, జగనన్న ప్రభుత్వం ఆదాయపరిమితిని ఏకంగా రూ 8 లక్షలకు పెంచి,ఒక్కో విధ్యార్దికి రూ 1 కోటి నుంచి రూ 1 కోటి, 25 లక్షల వరకు కేటాయించి, విదేశాలలో ఉన్నత విద్య నభ్యసింపచేయడం ద్వారా ఆ విద్యార్థుల కుటుంబాల ఆర్థిక సాధికారితకు ఎంతగానో దోహదపడుతుందని నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న ఈ జగనన్న విదేశీ విద్యాదీవెన పధకం కింద ఇప్పటివరకు 1830 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం లభించిందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్యా పథకం అక్రమాల పుట్టగా మారిందని, విజిలెన్స్ విచారణలో వెళ్లడవడంతో, లోపాలను సరిదిద్ది మరింత ఎక్కువమందికి, ఎక్కువ ఆర్థిక సాయం అందించేలా అమల్లోకి తెచ్చిందన్నారు.
21 నిర్దేశిత సబ్జెక్టుల కేటగిరీలలో, 50 విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబిసి, మైనారిటీ, కాపు విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా ట్యూషన్ ఫీజు కింద రూ 1 కోటి 25 లక్షల వరకు జగనన్న ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 2019 నుంచి కార్పొరేషన్ల వారీగా జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్ధిదారులు 1830 మందిలో ఈబీసీలు 803 మంది, బిసిలు 263 మంది, కాపులు 316 మంది, ఎస్సీలు 195 మంది, ఎస్టిలు 24 మంది, మైనారిటీలు 229 మంది ఉన్నారన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ 8 లక్షలకు పెంచడం ద్వార పైన తెలిపినట్లు ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరుగిందన్నారు. పేదలు, బడుగుల తలరాతలు విద్య ద్వారానే మారతాయని, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారానే, కుటుంబాల ఆర్థిక సాధికారిత సాధ్యమవుతుందని నమ్మి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా, జగనన్న ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని మూర్తి హర్షం వ్యక్తం చేశారు.