వైద్య విద్యా విధానంలో గత వందేళ్ళ చరిత్రను తిరగరాసిన జగనన్న
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రూ 8480 కోట్ల వ్యయంతో, 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఏకకాలంలో ఐదు మెడికల్ కాలేజీల్లో అకాడమిక్ తరగతులను కూడా సెప్టెంబర్ 15న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన శుభ సందర్భంగా వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యసిబ్బంది, ప్రజలందరికీ నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తి ఓ పత్రికా ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే రోజు రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వం విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి, వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల మచిలీపట్నం లతో కలిపి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అకాడమిక్ తరగతులు ప్రారంభించిన శుభ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాభినందనలు తెలియజేస్తున్నానన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో వైద్య విద్యా విధానంలో వందేళ్ళ చరిత్రను తిరగరాసేలా మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీనితో ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2550 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని, అలాగే మెడికల్ పిజి సీట్ల సంఖ్య 966 నుంచి 1767కు పెంచిన జగనన్న ప్రభుత్వాన్ని వైద్య నిపుణులు అందరూ ప్రశంసిస్తున్నారన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తరువాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకాడమిక్ తరగతులు ప్రారంభించనున్నామని సీఎం తెలియజేయడం హర్షణియమన్నారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ మల్టీ /సూపర్ స్పెషాలిటీ అధునాతన వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలని జగనన్న తాపత్రయ పడుతున్నారన్నారు. అందుకే ప్రతి మెడికల్ కాలేజీలో రూ 500 కోట్ల వ్యయంతో టీచింగ్ హాస్పటళ్ళు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు, అత్యాధునిక సాంకేతికతతో లేబరేటరీలు, డిజిటల్ లైబ్రరీలు, సీసీటీవీల ఏర్పాటుతో భవన నిర్మాణాలను పూర్తిచేయాలని భావిస్తున్నారన్నారు. దీనితో వైద్య విధాన చరిత్రలో నూతన శకం ప్రారంభమైందని, అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా పేదలు బడుగులందరికీ అందేలా జగనన్న ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
అంకంరెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్