మూడేళ్లుగా రోడ్డు మార్జిన్ కంపల్లో బస్ షెల్టర్-అల్ఫా హోటల్ ఎదురుగా
మంగళగిరి : ఎంటీఎంసీ నగర పరిధిలో బస్ షెల్టర్లు లేక వేసవికాలం మండుటెండలకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదారేళ్ల క్రితం ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు గౌతమబుద్థ రోడ్డు విస్తరణ పేరిట తొలగించి రోడ్డు మార్జిన్లో పడేశారు. కొన్ని షెల్టర్లు అదృశ్యం కాగా మరికొన్ని కంపల్లో దర్శన మిస్తున్నాయ్.రోడ్డు విస్తరణ పనులు పూర్తయినప్పటికీ వీటి గురించి మాత్రం పట్టించు కునే తీరిక మాత్రం ఎంటీఎంసీ అధికారులకు చిక్కలేదు. క్షేత్ర స్థాయి లో పర్యటించి ప్రజల అవసరాలు గుర్తించే యంత్రాంగం ఇక్కడ లేదనేదీ జగమెరిగిన సత్యం.
అభివృధ్థి కోసం ఎమ్మెల్యే ఆర్కే తపన పడటం మినహా అధికారుల సహకారం చాలా విషయాల్లో లేదని చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడు అధిలిస్తే తప్ప అడుగు ముందుకు పడటంలేదు. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా బస్ షెల్టర్లు అవసరమే. ఈ సత్యాన్ని గుర్తించి కంపల్లో వున్న బస్ షెల్టర్లను గుర్తించి వెంటనే ఏర్పాటుకు కార్యచరణ ప్రారంభించి ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ప్రజాధనం సద్వనియెగ పరచాలి.
ఈ విషయంలో ఎమ్మెల్యే ఆర్కే జోక్యం అనివార్యం.
- సేకరణ : యస్ యస్ రెడ్డి