ఆరోపణలకు ఒక్కటే సమధానం చెప్తున్నా – దొంతిరెడ్డి వేమారెడ్డి
తాడేపల్లి:
తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంగళగిరి-తాడేపల్లి వైసిపి నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి
ఆరోపణలకు ఒక్కటే సమధానం చెప్తున్నా
నియోజకవర్గంలో ఉన్న ప్రతిఒక్క వ్యక్తికీ తెలుసు దొంతరెడ్డి అంజిరెడ్డి కుటుంబం ఏ పార్టీకీ పనిచేస్తుందో ఎవరిని నమ్మి ఉంటుందో.
40 సంవత్సరాలుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి విధేయులుగా ఉన్నాం
రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ఇతర ముఖ్య నాయకుల సలహాలు, సూచనలతోనే నాకు సీఎం జగన్ ఈ పదవి ఇచ్చారు
మంగళగిరిలో పార్టీకి గెలుపు, అభివృద్దే లక్ష్యంగా అందరిని కలుపుకొని పని చేస్తాను..
మనస్కరించేలా ఉంటే ఇంట్లో కూర్చుంటాం అంతేకానీ ఇతర పార్టీల కోసం పని చేయం, ఇప్పటి వరకు చేయలేదు, అది జరగదు, రాబోయే రోజుల్లో కూడా జరగదు