– Sajjala Ramakrishna Reddy is responsible if any harm happens to me
– My support for the capital Amaravati, my turn for the development of Amaravati
Will work hard
– Sridevi is harming herself by being loyal to the National ST Commission
Request that there is
– YCP goons are harassing me.. I am afraid to come to AP
Is it? Am I a terrorist?
– Undavalli Sridevi, Tadikonda – MLA
New stories from yesterday. Where is Sridevi? Sridevi went into hiding. Is Hyderabad the Sahara Desert? Or the underground in Dubai? Am I a mafia gang? Am I a terrorist?
Hyderabad: YCP goons have been harassing her for three days, MLA Undavalli Sridevi has opened up to the sensation. Today she came before the media for the first time after the allegations of cross-voting in Hyderabad. YCP goons complained that they were using unparliamentary language. He expressed that it is very painful to see the language used by them without even seeing that there is no woman legislator in their house. Undavalli Sridevi said.. “New stories from yesterday.” Where is Sridevi? Sridevi went into hiding. Is Hyderabad the Sahara Desert? Or the underground in Dubai? Am I a mafia gang? A terrorist? The reason for going into hiding is.. How did Dr. Sudhakar die the other day? You know how Dr. Achanna died yesterday. Like them, Sridevi also went with the intention of not dying.
Did you see the attack on my party office the other day? Why did those paid artists go to the party office and destroy it? Who owns the sand mafia in Uddandaraipalem? They are accusing me of where I will get in the way. They have been conspiring against me since the beginning. They stamped that I have taken the note for vote. Conspiracies were made against me even before the MLC elections. They are criticizing without seeing that she is a woman. In the capital area, they have done all the dandas, sand mining.. Mafias have done everything and paid tributes and our honorable Chief Minister says.. DPT means rob, share, eat. They planned to fire me if I could get in the way of all this. Part of that pre-plan is the case of note-to-vote. did i vote Who did I give it to? Unknowingly, many stories have been served.
Is there anyone secretly sitting under the table while I vote? They planned to remove Sridevi and conspired to witness the MLC election. My husband and I are both doctors. I had a good qualification so when I was asked to contest I went under the illusion that I would serve the people. In a constitution MLA post is for 5 years. But it is not known which constitution is in force in AP. When I went to Gadapagadapa during the election, everyone asked me.. ‘Will Amaravati stay here?’ Dare to say that Ma Jagananna has built a house in Tadepalli. But what could not be done if they were struggling for the capital for some time. Has the development in Amaravati been done elsewhere in the state? Thousands of crores were pressed in the name of development. I am afraid to come to AP. Because of the attacks on SCs. Sridevi asked, “If I am afraid as an MLA, can common people turn around?”
– నాకేమైనా హాని జరిగితే సజ్జల రామకృష్ణ రెడ్డి దే బాధ్యత
– రాజధాని అమరావతి కే నా మద్దతు, అమరావతి అభివృద్ధి కి నా వంతు
కృషి చేస్తా
-నేషనల్ ఎస్టీ కమిషన్ కు మ్ముందస్తుగా ఉండవల్లి శ్రీదేవి తనకు హాని
ఉందని విన్నపం
– వైసీపీ గూండాలు నన్ను వేధిస్తున్నారు.. ఏపీకి రావాలంటేనే భయం
వేస్తోంది.. నేనేమైనా టెర్రరిస్టునా?
– ఉండవల్లి శ్రీదేవి , తాడికొండ – ఎమ్మెల్యే
నిన్నటి నుంచి కొత్త కథలు. శ్రీదేవి ఎక్కడ అంటూ. శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ అనేది సహారా ఎడారా? లేదంటే దుబాయ్‌లోని అండర్ గ్రౌండా? నేనేమైనా మాఫియా గ్యాంగా? టెర్రరిస్టునా?
హైదరాబాద్ : మూడు రోజులుగా వైసీపీ గూండాలు తనను వేధిస్తున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలనానికి తెరదీశారు. నేడు ఆమె హైదరాబాద్‌లో క్రాస్ ఓటింగ్ ఆరోపణల అనంతరం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ గూండాలు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని వాపోయారు. ఒక మహిళా శాసనసభ్యురాలని లేదని.. తమ ఇంట్లో ఒక అక్కా చెల్లి ఉన్నారని కూడా చూడకుండా వాళ్లు వాడే లాంగ్వేజ్ చూస్తుంటే చాలా బాధ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ నిన్నటి నుంచి కొత్త కథలు. శ్రీదేవి ఎక్కడ అంటూ. శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ అనేది సహారా ఎడారా? లేదంటే దుబాయ్‌లోని అండర్ గ్రౌండా? నేనేమైనా మాఫియా గ్యాంగా? టెర్రరిస్టునా? అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం ఏంటంటే.. మొన్న డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారు? నిన్న డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయారనేది మీకు తెలుసు. వీరిలాగే శ్రీదేవి కూడా చనిపోకూడదనే ఉద్దేశ్యంతోనే వెళ్లడం జరిగింది.
మొన్న నా పార్టీ ఆఫీస్‌పై జరిగిన దాడిని మీరు చూశారా? ఆ పెయిడ్ ఆర్టిస్టులు పార్టీ ఆఫీసుకెళ్లి ధ్వంసం చేయడమేంటి? ఉద్దండరాయిపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది? నేనెక్కడ అడ్డు వస్తానో అని నాపై నిందలు వేస్తున్నారు. మొదటి నుంచి కావాలనే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే నాపై కుట్రలు చేశారు. మహిళ అని చూడకుండా ఇష్టారీతిన విమర్శిస్తున్నారు. రాజధాని ఏరియాలో వాళ్లు చేసిన దందాలు, ఇసుక మైనింగ్.. మాఫియాలు అన్నీ చేసి ముడుపులు చెల్లించుకుని మా గౌరవ ముఖ్యమంత్రిగారు అంటారు.. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో. వీటన్నింటికీ నేనేక్కడ అడ్డు వస్తానోనని నన్ను తొలగించాలని నన్ను ప్లాన్ చేశారు. ఆ ప్రీ ప్లాన్‌లో భాగమే ఓటుకు నోటు కేసు. నేను ఓటేశానా? ఎవరికి వేశాను? అనేది తెలియకుండానే చిలవలు పలవలుగా కథనాలు వడ్డించారు.
నేను ఓట్ చేస్తున్నప్పుడు వారెమైనా సీక్రెట్‌గా టేబుల్ కింద ఎవరైనా కూర్చొన్నారా? శ్రీదేవిని తొలగించాలని పక్కాగా ప్లాన్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా.. కుట్ర చేశారు. నా భర్త, నేనూ ఇద్దరం డాక్టర్స్. మంచి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నన్ను కంటెస్ట్ చేయమని అడగ్గానే ప్రజలకు సేవ చేద్దామని భ్రమపడి వెళ్లాను. ఒక రాజ్యాంగంలో ఎమ్మెల్యే పదవి 5 ఏళ్లు ఉంటుంది. కానీ ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తెలియదు. ఎలక్షన్ సమయంలో గడపగడపకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను అడిగారు.. ‘అమరావతి ఇక్కడే ఉంటుందా?’ అని. మా జగనన్న తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. ఇక అమరావతి రాజధాని కాకుండా ఎక్కడికి పోతుందని ధైర్యం చెప్పా. కానీ కొంతకాలంగా వారు రాజధాని కోసం ఇబ్బంది పడుతుంటే ఏం చేయలేకపోయేదాన్ని. అమరావతిలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా చేశారా? అభివృద్ధి పేరుతో వేల కోట్లు నొక్కేశారు. నాకు ఏపీకి రావాలంటే భయమేస్తోంది. ఎందుకంటే ఎస్సీలపై జరుగుతున్న దాడులు. ఎమ్మెల్యేగానే నేను భయపడుతుంటే.. సామాన్యులు తిరగగలరా?’’ అని శ్రీదేవి ప్రశ్నించారు.