కార్మికశాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ గారి జన్మదినోత్సవం(17జూన్ ) సందర్భంగా ప్రత్యేక కథనం
- అందరివాడు వాసంశెట్టి
కోనసీమ రాజకీయ క్షేత్రంలో ఎందరో నాయకుల ప్రస్ధానం ఒక ఎత్తు.. వాసంశెట్టి సుభాష్ రాష్ట్రకార్మికశాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాగుతున్న ప్రస్ధానం మరో ఎత్తు. ఎదిగిన కొద్ది ఒదిగుండాలి అనేది సుభాష్ లో కొట్టొచ్చినట్టు కనిపించే సుగుణం. మాటల్లో స్పష్టత, పనిలో నిబద్దత, విలువల్లోఖచ్చితత్వం, మనుషుల పట్ల ఆత్మీయతత్వం, ఈ సుగుణాలను గుదిగుచ్చితే వాసంశెట్టి సుభాష్ . మానవతా విలువలున్న వాడు, అందరివాడు సుభాష్ .
తెలుగుదేశం లాంటి పెద్దపార్టీలో అందరినీ ఒకే త్రాటిపైకి తెచ్చి టీడీపీలో సరికొత్త వేగాన్ని నింపిన సమన్వయ యోధుడు ఆయన.క్షేత్రస్ధాయి నుంచి శిఖరాగ్రం వరకు పార్టీని నడిపిస్తున్న ఆయన నాయకత్వ శైలికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ లను సైతం మంత్రముగ్ధులను చేసింది. అనేక సందర్భాల్లో వారి నుంచి లభించిన ప్రశంసలే వాసంశెట్టి సుభాష్ కు శ్రీరామరక్షగా నిలిచాయి.
విమర్శలతుఫానులనుఎదురొడ్డినిలిచిన ధీరుడు…శ్రమనే నమ్ముకుని,
అట్టడుగు స్థాయి నుండి శిఖరాగ్రానికినఎదిగిన పోరాట యోధుడు.. !
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటకునిలువెత్తు రూపం…
పదవులు చూసి రాలేదు…కష్టాన్నే నమ్ముకుని పైకొచ్చారు..!
విమర్శలకు బెదరని నైజం…అడ్డంకులను దాటే ధైర్యం..!
ప్రజా సేవలోనే ప్రయాణం సాగిస్తున్నారు వాసంశెట్టి సుభాష్ .కేవలం అధికార పీఠానికే పరిమితం కాకుండా నిరంతరం జనం మధ్య నడుస్తూ, జనంతోనే శ్వాసిస్తూ అసాధారణ ప్రజాదరణను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర సమగ్ర పునర్నిర్మాణంలో వాసంశెట్టి సుభాష్ భాగస్వాములవుతున్నారు. అంతేకాదు తన సామాజిక వర్గమైన శెట్టిబలిజలకు పెద్దన్నగా ఉంటూ వారితో మమేకమై వారితో నడుస్తూ తమ సోదరుల కన్నీళ్ళను తుడిచే సుభాష్ వారి ఉజ్వల భవిష్యత్తుకు ఒక నమ్మకమైన భరోసాగా, ధీశాలిగా నిలుస్తున్నారు.
అప్పగించిన బాధ్యతలను నైపుణ్యంగా చేసుకుని పోవడం ఆయన నైజం.క్షేత్రస్ధాయి కార్యకర్తలను సైతం గౌరవిస్తూ వారందరిని గ్రూపు రాజకీయాలకు దూరం ఉంచటంలో ఆయన దిట్ట. పరిస్ధితులు ఎలాంటివైన ఎలాంటి వైన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే స్వభావం ఆయనది.కార్యకర్తకు దగ్గరగానే కాదు అండగా నిలవడం సుభాష్ స్టయిల్ . ఒక వైపు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాసంశెట్టి నేర్పరి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో సాన్నిహిత్యంగా ఉంటూ రామచంద్రపురం నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరు చేయించడంలో ఆయన కృషి అమోఘం. రామచంద్రపురం ప్రాంత అభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతిలో సుభాష్ కృషిప్రశంసనీయం. విమర్శలకు నెరవకుండా పొగడ్తలకు పొంగకుండా ఉండటం శైలి. కోనసీమ జిల్లాలో టిడీపీలో సమన్వయం పాటించడం ఆయన గొప్ప లక్షణం. జన నాయకుడికి కోనసీమ ప్రజలు, సుభాష్ అభిమానులు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు శెట్టి బలిజ సమాజం ముక్త కంఠంతో జన్మదిన జేజేలు పలుకుతున్నది ఆయన మరిన్ని విజయశిఖరాలను అధిరోహించాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు..ఈనెల 17న జన్మదినోత్సవం జరుపుకుంటున్న వాసంశెట్టి సుభాష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.














































