Date :07-03-2025
అమరావతి:
విఐటి-ఏపి విశ్వ విద్యాలయంలో ఘనంగా ప్రారంభమైన
విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం
విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ది . 7 మార్చి 2025 నాడు మొదటిరోజు సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం సంగీత మరియు నృత్య విభాగాలలో మొదటి దశ పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు వసుదైకం అనే వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ ర్యాలీ తో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని, అవి విద్యార్థుల మనసికాభివృద్దికి ఎంతో దోహదపడతాయని, విటోపియ వంటి క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ద్వారా విధ్యార్థులు తమ క్రీడా, సాంస్కృతిక ప్రతిభను పెంపొందించుకోవటానికి సాధ్యపడుతుందని తెలియచేసారు.
విఐటి వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియచేసారు.
విఐటి-ఏపి విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతిని గూర్చి వివరించారు. గత మూడు సంవత్సరాలుగా అవుట్ లుక్ ర్యాకింగ్స్ లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కేటగిరిలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని తెలియచేసారు.
సాయంత్రం జరిగిన ప్రొ-షో లో సెహరి బ్యాండ్, స్వరాగ్ బ్యాండ్, డిజె పరోమా ల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో విఐటి-ఏపి విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డా || జగదీష్ చంద్ర ముదిగంటి , డా|| కృష్ణ సామి (విటోపియా కన్వీనర్), డా|| ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్), విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఆహ్వానితులు, అతిధులు, సిబ్బంది పాల్గొన్నారు.