Amaravati: The Pharmacy College of India has challenged the notification issued by the Pharmacy Council of India on 8/2/2023 increasing the regulatory fee to the highest level in the Hon’ble High Court.
Advocate Matukumilli Srivijay, on behalf of the colleges’ association, argued that the regulations made by the Pharmacy Council of India are not legal and brought to the attention of the court that there is no provision in the Pharmacy Act to collect any regulatory fee and that the fees have been increased by about 600 percent. Other national institutes like AICTE, MCI, IDC and INC have also explained that there is no such huge amount of fees.
Receiving the urgent petition, the Hon’ble High Court has issued an interim order directing them to collect the fees from the colleges and process their applications as per the earlier notification dated 4/5/2018.
Matukumilli Srivijay
State Legal Adviser, High Court Advocate
అమరావతి: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 8/2/2023 న రెగ్యులేటరీ ఫీజు అత్యధికంగా పెంచుతూ ఇచ్చిన నోటిఫికేషన్ ను గౌరవ హైకోర్టులో సవాల్ చేసిన ఫార్మసీ కళాశాలలా సంఘం.
కళాశాలల సంఘం తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదిస్తూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన రెగ్యులేషన్స్ కు చట్టబద్ధత లేదని, ఫార్మసీ యాక్ట్ లో ఎటువంటి రెగ్యులేటరీ ఫీ వసూలు చేయడానికి ఎటువంటి నిబంధనలు లేవని గతం కంటే సుమారు 600 శాతం ఫీజులను పెంచారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇతర జాతీయ సంస్థలు AICTE, MCI, IDC మరియు INC కూడా ఇంత పెద్ద మొత్తం ఫీస్ లేదని వివరించారు.
అత్యవసర పిటిషన్ గా స్వీకరించిన గౌరవ హైకోర్టు గతంలో 4/5/2018 తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కళాశాలల నుండి ఫీజు తీసుకుని వారి దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.