ఏబీఎన్ పూర్ణ మృతి జర్నలిజానికి తీరని లోటు….- మంత్రి కొలుసు పార్థసారథి..
జర్నలిస్టు అనే పదానికి పరిపూర్ణమైన అర్థానికి నిలువెత్తు నిదర్శనం ఏబీఎన్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేశంనేని పూర్ణచంద్రరావు. అనారోగ్య సమస్యలతో ఆకస్మికంగా మృతిచెందడం తీవ్రంగా కలచివేసింది. వృత్తిపట్ల అంకితభావం, సమాజం పట్ల ఎనలేని గౌరవం, బాధ్యత, సమస్యలపై అధ్యయం చేసే విధానం చూస్తే జర్నలిజం అంటే ఆయనకు ఎంత ప్రత్యేక అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుదేశంపార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా రిపోర్టింగ్ చేసే పూర్ణచంద్రరావు….తాను పనిచేసే ఛానల్ పేరునే ఇంటిపేరుగా పిలిపించుకునేంతలా సమాజంలో కీర్తిప్రతిష్టలు గడించారు. ఏబీఎన్ పూర్ణ అంటే యావత్ రాష్ట్రం మొత్తం ఒక ప్రత్యేక గౌరవం. ఇలాంటి మంచి జర్నలిస్టును కోల్పోవడం రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ తీరని లోటు. మంచి, చెడులను నిర్మొహమాటంగా చెప్పే తత్వం ఉన్న మంచి జర్నలిస్టు ఇకలేరు అనే వార్త వినడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ…ఆయన మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు, జర్నలిస్టు మిత్రులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
కొలుసు పార్థసారథి,












































