ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినతులు వెల్లువెత్తాయి.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్ర ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. తమ వ్యక్తి గత సమస్యలను విన్నవించి సాయం అర్దించారు. ఓపిగ్గా అందరి నుండి వినతి పత్రాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భారీగా తరలి వస్తున్న ప్రజలను కలిసేందుకు ఇకపై ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు