జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో సమావేశం.
అమరావతి,1 ఏప్రిల్: రాష్ట్రంలో వడగాల్పులు, తాగునీరు,విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ,ఫించన్ల పంపిణీ అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈసమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్,జలవనరులు, పిఆర్ అండ్ ఆర్డిశాఖల ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి,పిఆర్ అండ్ ఆర్డి శాఖ కమీషనర్ కె.కన్నబాబు,విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్.కూర్మనాధ్, ఆర్డబ్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్,వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.